తీర గ్రామాల్లో నూతన పింఛన్ల పంపిణీ

ABN , First Publish Date - 2020-08-01T09:25:53+05:30 IST

మండల పరిధి లోని తాళ్లపాలెం, కానూరు, పెదపట్నం గ్రామంలో నూతనంగా మంజూరైన పింఛన్లను మంత్రి పేర్ని నాని శుక్రవారం పంపిణీ చేశారు.

తీర గ్రామాల్లో నూతన పింఛన్ల పంపిణీ

మచిలీపట్నం టౌన్‌  : మండల పరిధి లోని తాళ్లపాలెం, కానూరు, పెదపట్నం గ్రామంలో నూతనంగా మంజూరైన పింఛన్లను మంత్రి పేర్ని నాని శుక్రవారం పంపిణీ చేశారు. మండలంలో 307 సామాజిక పింఛన్లు మంజూరయ్యాయని ఇన్‌చార్జి  ఎమ్డీవో, డ్వామా పీడీ జి.వి. సూర్యనారాయణ తెలిపారు. సాగునీటి సమస్యను స్థానిక  రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తహసీల్దార్‌ బి. సునీల్‌బాబు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు లంకే వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ వాలిశెట్టి రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి పెదపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు.

Updated Date - 2020-08-01T09:25:53+05:30 IST