స్టేలతో అడ్డుకోవాలని చూస్తున్నారు : పేర్ని ఆరోపణ

ABN , First Publish Date - 2020-12-29T07:03:42+05:30 IST

పేదల సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో స్థలాలు మంజూరు చేస్తుంటే, ప్రతిపక్షాలు కోర్టుల చుట్టూ తిరిగి స్టేలతో అడ్డుకోవాలని చూస్తున్నాయని మంత్రి పేర్ని నాని ఆరోపించారు.

స్టేలతో అడ్డుకోవాలని చూస్తున్నారు : పేర్ని ఆరోపణ
కోడూరులో పట్టాలు అందజేస్తున్న మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే సింహాద్రి

కోడూరు, డిసెంబరు 28 : పేదల సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో స్థలాలు మంజూరు చేస్తుంటే, ప్రతిపక్షాలు కోర్టుల చుట్టూ తిరిగి స్టేలతో అడ్డుకోవాలని చూస్తున్నాయని మంత్రి పేర్ని నాని ఆరోపించారు.   మండలంలోని  732 మంది లబ్ధిదారులకు అధికారులు, ప్రజా ప్రతి నిధులతో కలసి పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకో వటానికి సిద్ధంగా ఉందన్నారు.  ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ పేదవాడి నివేశనా స్థలాలకు మెరక చేసుకునేందుకు మట్టిని తరలి స్తుంటే అడ్డుకునే యత్నాలు టీడీపీ నాయకులు చేస్తున్నారని ఆరోపించారు.   జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత, ఆర్డీవో ఖాజావలి, తహసీల్దార్‌ లతీఫ్‌ పాషా, ఎమ్డీవో సుధాప్రవీణ్‌, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T07:03:42+05:30 IST