స్వీయ నిర్బంధంలో మంత్రి కొడాలి నాని

ABN , First Publish Date - 2020-03-23T15:30:37+05:30 IST

కరోనా నివారణకు వైద్యుల సూచనలు పాటిస్తూ..

స్వీయ నిర్బంధంలో మంత్రి కొడాలి నాని

కర్ఫ్యూ విజయవంతంపై ప్రజలకు అభినందనలు


గుడివాడ(కృష్ణా): కరోనా నివారణకు వైద్యుల సూచనలు పాటిస్తూ సామాజిక దూరాన్ని పాటిద్దామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు. ఆదివారం ఆయన తన కుటుంబసభ్యులతో ఇంటి వద్దే గడిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి వరకూ తనకు తానే స్వీయ నిర్బంధం విధించుకున్నారు. నిత్యం సందర్శకులతో రద్దీగా ఉండే క్యాంప్ కార్యాలయం, ఆయన స్వగృహాల వద్ద నిర్మానుష్య వాతావరణం నెలకొంది. జనతా కర్ఫ్యూ కొనసాగుతున్న తీరును ఫోన్ ద్వారా తెలుసుకుంటూ అధికారులకు సూచనలు చేశారు. సాయంత్రం ఐదు గంటలకు చప్పట్లు కొట్టి వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి నాని, ఆయన కుటుంబసభ్యులు సంఘీభావం తెలిపారు.

Read more