మమ్మల్ని రెగ్యులర్‌ చేయండి

ABN , First Publish Date - 2020-12-07T14:24:28+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న..

మమ్మల్ని రెగ్యులర్‌ చేయండి

మంత్రి పేర్ని నానీకి వినతి


మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న మండల సమాఖ్య క్లస్టర్‌ కో ఆర్డినేటర్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తూ వేతనాలు పెంచాలని, పదోన్నతులు కల్పించాలని కోరుతూ ఆదివారం రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)కి వినతిపత్రం సమర్పించారు. పేర్ని నాని కార్యాలయం వద్ద పలువురు వివిధ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. ఎన్‌.గొల్లపాలెం గ్రామస్థులు జిడ్డు గోగులు తదితరులు మంత్రిని కలసి తమ గ్రామంలో ఆర్‌వో ప్లాంట్‌ రీ ప్లేస్‌మెంట్‌ చేయాలని, విద్యుత్‌ స్తంభాలు వేయించాలని, పింఛన్లు మంజూరు చేయించాలని కోరారు. ఇళ్ల స్థలాలు ఇప్పించాలని చల్లపల్లికి చెందిన బత్తుల లక్ష్మీనాంచారమ్మ కోరింది. రేషన్‌ సరుకుల రవాణాకు వాహనం మంజూరు చేయించాలని బొర్రపోతుపాలెం శివారు పిల్లంగోడుపాలెం వాసి పెద్దిబోయిన దేవచంద్రరావు కోరారు.

Updated Date - 2020-12-07T14:24:28+05:30 IST