గజలక్ష్మిగా కొండాలమ్మ దర్శనం

ABN , First Publish Date - 2020-10-24T10:18:22+05:30 IST

వేమవరం శ్రీకొండామ్మవారు శుక్రవారం గజలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో సహస్ర కుంకమార్చన, సకల జన వ్యాపారాభివృద్ధి, ధనాభివృద్ధి కోసం ..

గజలక్ష్మిగా  కొండాలమ్మ దర్శనం

గుడ్లవల్లేరు : వేమవరం శ్రీకొండామ్మవారు శుక్రవారం గజలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.  ఆలయంలో సహస్ర కుంకమార్చన, సకల జన వ్యాపారాభివృద్ధి, ధనాభివృద్ధి కోసం మహాలక్ష్మి మూలమంత్ర హోమం నిర్వహించారు. అనంతరం మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)  అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి, ప్రత్యేకపూజలు చేశారు. మంత్రికి వేదపండితులు ఆశీర్వచనాలు పలికి, అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. దేవదాయశాఖ ఏ.సీ వి.సత్యనారాయణ, ఆలయ ఈవో నటరాజన్‌ షణ్ముగం,  పాలక మండలి చైర్మన్‌ కనుమూరి రామిరెడ్డి,  సభ్యులు బాడిగ లీలా సౌజన్య, మన్నెం అమల, డోకాల భాగ్యలక్ష్మి, వల్లూరి పద్మావతి, నారేపాలెం వెంకట నిర్మల, ఈడే విజయనిర్మల, పడవల వెంకటేశ్వరరావు, పామర్తి వెంకటస్వామి, అల్లూరి ఆంజనేయిలు, డోకాల కనకరత్నం, ఆలయ ప్రధానార్చకులు శివసంతోష్‌ శర్మ పాల్గొన్నారు.


 నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం 

వేమవరం కొండామ్మవారి ఆలయ నూతన పాలకమండలి ప్రమాణస్వీకారానికి మంత్రి కొడాలి నాని ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. కొండాలమ్మ దేవస్థానాన్ని రాష్ట్రంలోనే ప్రసిద్ధ దేవాలయంగా తీర్చిదిద్దుతామన్నారు. నూతన పాలకవర్గం ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలని, ప్రభుత్వం కూడా నిధులు ప్రభుత్వం సమకూరుస్తుందని మంత్రి అన్నారు.  దేవదాయశాఖ ఏసీ వి.సత్యనారాయణ నూతన పాలక మండలిచే ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్‌గా కనుమూరి రామిరెడ్డి, సభ్యులుగా బాడిగ లీలా సౌజన్య, మన్నెం అమల, డోకాల భాగ్యలక్ష్మి, వల్లూరి పద్మావతి, నారేపాలెం వెంకట నిర్మల, ఈడే విజయనిర్మల, పడవల వెంకటేశ్వరరావు, పామర్తి వెంకటస్వామిలతో ప్రమాణం చేయించారు. దుక్కిపాటి శశిభూషన్‌, పాలడుగు రాంప్రసాద్‌, కౌతవరం ఏపీసీఎస్‌ అధ్యక్షుడు  వడ్లమూడి నాగమోహన్‌(చిన్ని), ఆలయ అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్‌ బాడిగ భాస్కర్‌ (నాని), కసుకుర్తి జనార్ధన్‌ (బాబ్జి), పాలేటి చంటి, పెన్నేరు ప్రభాకరరావు, శేషం గోపి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-24T10:18:22+05:30 IST