విశాఖ ఘటనపై విచారణ జరుపుతాం : మంత్రి కన్నబాబు

ABN , First Publish Date - 2020-05-08T07:08:36+05:30 IST

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ

విశాఖ ఘటనపై విచారణ జరుపుతాం : మంత్రి కన్నబాబు

విజయవాడ, మే 7 (ఆంధ్రజ్యోతి) : విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. విజయవాడలో గురువారం ఆయన ఏబీఎన్‌తో మాట్లాడారు. ఆ పరిశ్రమ ఒకప్పుడు విశాఖ నగరానికి దూరంగా ఉండేదని, నగరం విస్తరించడంతో సమస్యలు వచ్చాయని చెప్పారు. ముందుగా మేల్కొని ఆస్పత్రికి వెళ్లిన బాధితులు ప్రాణాలతో బయటపడ్డారన్నారు. బాధితులను తరలించడానికి అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచామన్నారు. ఇంతకుముందూ ఈ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనలు ఉన్నాయని, అధికారులు దీనిపై సరిగ్గా స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.

Updated Date - 2020-05-08T07:08:36+05:30 IST