అవనిగడ్డలో రూ.40కు చికెన్‌

ABN , First Publish Date - 2020-03-13T10:37:46+05:30 IST

కరోనా వైరస్‌ భయంతో చికెన్‌ అమ్మకాలు భారీగా పడి పోవటంతో అవనిగడ్డలో గురువారం కిలో చికెన్‌ ధర రూ. 40 కు పడిపోయింది.

అవనిగడ్డలో రూ.40కు చికెన్‌

అవనిగడ్డ టౌన్‌, మార్చి 12: కరోనా వైరస్‌ భయంతో చికెన్‌ అమ్మకాలు భారీగా పడి పోవటంతో అవనిగడ్డలో గురువారం కిలో చికెన్‌ ధర రూ. 40 కు పడిపోయింది. రెండు రోజుల క్రితం వరకు రూ.  60 లుగా ఉన్న కిలో చికెన్‌ ధర గురువారానికి రూ. 40కి పడిపోయింది. నెల రోజుల క్రితం వరకు కిలో బ్రాయిలర్‌ చికెన్‌ రూ. 150కు పైగా అమ్ముడు పోగా, తాజాగా కిలో రూ. 40కి పడిపోయినప్పటికీ కొనేవారు లేక వ్యాపారులు దుకాణాల బయట బోర్డులు పెట్టి మరీ అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్రాయిలర్‌ చికెన్‌తో పాటు నాటు కోడి మాంసానికి కూడా డిమాండ్‌ తగ్గినప్పటికీ ధర మాత్రం యథాతఽథంగా కొనసాగుతోంది. 

Updated Date - 2020-03-13T10:37:46+05:30 IST