-
-
Home » Andhra Pradesh » Krishna » marturu accident krishna
-
ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో.. అక్కడికక్కడే..
ABN , First Publish Date - 2020-11-27T14:50:36+05:30 IST
జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో..

విషాదం..
మార్టూరులో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ఇద్దరిదీ విజయవాడే
మార్టూరు(కృష్టా): జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో భార్య అక్కడికక్కడే చనిపోగా భర్తకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో జరిగింది. ఏఎస్సై వెంకటేశ్వరరావు కథనం ప్రకారం ఒంగోలులో నివాసం ఉంటున్న మేరెడ్డి వెంకటసాయికుమార్‌రెడ్డి, కిరణ్మయి భార్యాభర్తలు.. బ్యాంక్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిద్దరూ విజయవాడలోని విద్యాధరపురానికి చెంది నవారు. వివాహమై 14 నెలలైంది. బుధవారం ఉదయం విజయవాడలో ఓ వివాహానికి వెళ్తి రాత్రి 11 గంటల సమయంలో కారులో ఒంగోలు బయలుదేరారు. మార్టూరు సెంటరుకు రాగా ఆగి ఉన్న లారీని గమనించక వెనుక నుంచి ఢీకొట్టింది. కారు నడుపుతున్న భర్త సాయికుమార్‌రెడ్డి తీవ్రంగా గాయపడగా, భార్య కిరణ్మయి సీటులోనే మృతి చెందింది. ఏఎస్సై వెంకటేశ్వర్ల్లు సిబ్బందితో వెళ్లి కారును బయటకు తీయించారు. వెంకటసాయికుమార్‌రెడ్డిని 108లో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి దొడ్డి రమేష్ ఫిర్యాదు మేరకు గురువారం కిరణ్మయి మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.