రైతుల అభ్యున్నతికి బ్యాంకు సహకారం
ABN , First Publish Date - 2020-11-26T06:08:25+05:30 IST
రైతుల అభ్యున్నతికి బ్యాంకులు కట్టుబడి ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ మేనేజర్, హైదరాబాద్ రీజియన్ జనరల్ మేనేజరు మన్‌మోహన్‌గుప్తా పేర్కొ న్నారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ మేనేజర్ మన్‌మోహన్‌గుప్తా
నందివాడరూరల్ : రైతుల అభ్యున్నతికి బ్యాంకులు కట్టుబడి ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ మేనేజర్, హైదరాబాద్ రీజియన్ జనరల్ మేనేజరు మన్‌మోహన్‌గుప్తా పేర్కొ న్నారు. స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖను బుధవారం ఆయన విజయవాడ రీజియన్ మేనేజర్ సిహెచ్.రాజశేఖర్‌తో కలిసి సందర్శించారు. మన్‌మోహన్‌గుప్తా మాట్లాడుతూ గ్రామీణ మహిళలకు పొదుపు ఖాతాలను అనుసరించి రుణాలు మంజూరు చేయడంలో నందివాడ శాఖ అగ్రగామిగా ఉందని అభినందించారు. రైతులకు ట్రాక్టర్లను అందించారు. 400కుపైగా స్వయం ఉపాధి గ్రూపులకు రూ.కోటికిపైగా రుణాలు అందించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజరు మణిదీప్, గుడివాడ బ్రాంచి మేనేజర్ చంద్రశేఖర్, జాయింట్ మేనేజర్ ధనుంజయ్, అగ్రి ఆఫీసర్ జలజ, స్థానికులు ఎం.పద్మారెడ్డి, రామ్మోహనరెడ్డి, పాల్గొన్నారు.