కారు బీభత్సం

ABN , First Publish Date - 2020-03-02T09:58:24+05:30 IST

ఓ కారు బీభత్సం సృష్టించింది... డ్రైవర్‌ మద్యం మత్తులో కారును నడుపుతూ అదుపు తప్పటంతో ద్విచక్ర వాహనదారులను ఢీకొన బోయాడు.

కారు బీభత్సం

విద్యాధరపురం, మార్చి 1 : ఓ కారు బీభత్సం సృష్టించింది... డ్రైవర్‌ మద్యం మత్తులో కారును నడుపుతూ అదుపు తప్పటంతో ద్విచక్ర వాహనదారులను ఢీకొన బోయాడు. కారు అదుపు తప్పి టైర్‌ పంక్చరై ఆగిపోయింది. ఈ సంఘటన విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. బెంజ్‌సర్కిల్‌ వైపు నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వైపు కారు డ్రైవర్‌ మద్యం మత్తులో అతివేగంగా వాహనాన్ని తోలుతూ స్వరాజ్‌ మైదానం వద్దకు వచ్చే సరికి కారు అదుపు తప్పి ద్విచక్ర వాహనాలను ఢీకొన బోయింది.


కారు టైర్‌ పంక్చర్‌ కావటంతో డివైడర్‌ పక్కన నిలిచిపోయింది. ఈ సంఘటనతో  వాహనచోదకులకు ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో రోడ్డు పై జనంలేకపోవడంతో  పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో స్ధానికులు, పలువురు వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ు స్ధానికులు కారు నడుపుతున్న డ్రైవర్‌ను పట్టుకోవటానికి ప్రయత్నించగా డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న మరో వ్యక్తి కారు వదిలి పరారయ్యారు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి కారును తనిఖీ చేశారు. కారులో రెండు మద్యం సీసాలు, వాటర్‌ బాటిల్‌ లభించాయి. పోలీసులు మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కారును పోలీసు స్టేషన్‌కు తరలించారు. కారు నెంబర్‌ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. 

Updated Date - 2020-03-02T09:58:24+05:30 IST