రింగ్‌రోడ్డుతో గుడివాడకు మహర్దశ

ABN , First Publish Date - 2020-03-21T10:27:05+05:30 IST

విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం, పామర్రు, బంటుమిల్లి రోడ్లను కలుపుతూ గుడివాడకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు రూపకల్పనపై దృష్టి సారించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వ రరావు(నాని) అధికారులను ఆదేశించారు.

రింగ్‌రోడ్డుతో గుడివాడకు మహర్దశ

 మంత్రి కొడాలి నాని


గుడివాడ, మార్చి 20 : విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం, పామర్రు, బంటుమిల్లి రోడ్లను కలుపుతూ గుడివాడకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు రూపకల్పనపై దృష్టి సారించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వ రరావు(నాని) అధికారులను ఆదేశించారు.  శుక్ర వారం ఆయన మున్సిపల్‌ అధికారులతో ఈ విష యమై సమావేశమయ్యారు. 1987లో పట్టణానికి ఉడా అందజేసిన మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఉందని, దాని నిర్మాణం కోసం 30 ఏళ్లుగా పట్టణ వాసులు ఎదురు చూస్తున్నారని మంత్రి నాని అన్నారు.  పురపాలక సంఘ టౌన్‌ ప్లానింగ్‌, సర్వే శాఖ అధికారులతో ఈ విష యమై చర్చించారు.  సర్వే మ్యాప్‌లు పరిశీలిం చారు. ఔటర్‌ లేకపోవడంతో పరిశ్రమలు అభి వృద్ధి చెందలేదని మంత్రి నాని అభిప్రాయ పడ్డారు. గుడివాడ పట్టణంలోనికి భారీ వాహ నాల ప్రవేశం లేకుండా చేయాలని సూచించారు.


దీనిపై టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌, మున్సిప్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులతో సమావేశమై తుది రూపు తీసుకువస్తానని మంత్రి చెప్పారు. మల్లాయిపాలెంలోని టిడ్కో హౌసింగ్‌ ప్లాట్ల వద్ద బంటుమిల్లి రోడ్డు నుంచి మంచిలీపట్నం వైపు వెళ్లే వాహనాలు వెళ్తాయని, వలివర్తిపాడు మీదుగా ఎన్జీవో కాలనీ దాటిన తర్వాత ఏలూరు రోడ్డు నుంచి వచ్చే వాహనాలు బంటుమిల్లి రోడ్డులోకి ప్రవేశిస్తాయని తెలిపారు. పామర్రు నుంచి వచ్చే వాహనాలు పెదఎరుకపాడు శివారుల్లోని పొలాల నుంచి ఏఎన్నార్‌ కళాశాల వద్ద విజయవాడ రోడ్డులోకి వెళ్తాయని విశదీ కరించారు. మచిలీపట్నం నుంచి పామర్రు రోడ్డు లోకి వెళ్లే వాహనాలు బిళ్లపాడు వద్ద జాతీయ రహదారిలోకి ప్రవేశిస్తాయని వివరించారు. విజయవాడ నుంచి వచ్చే వాహనాలు భూషణ గుళ్ల నుంచి నాగవరప్పాడు మీదుగా ఏలూరు రోడ్డులోకి ప్రవేశిస్తాయని, బంటుమిల్లి రోడ్డు నుంచి వచ్చే వాహనాలు బొమ్ములూరు రోటరీ కంటి ఆస్పత్రి వద్ద మచిలీపట్నం రహదారి లోనికి ప్రవేశిస్తాయని చెప్పారు.  మున్సిపల్‌ కమిషనర్‌ పి.జె.సంపత్‌కుమార్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారిపీ.నాగేంద్రప్రసాద్‌, పట్టణ సర్వేయర్‌ కె.నాగేంద్రప్రసాద్‌, వైసీపీ నాయకులు మాజీ కౌన్సిలర్‌ పి.వి.కృష్ణారావు, పాలేటి చంటి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-03-21T10:27:05+05:30 IST