తెలంగాణ మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-12-15T06:00:56+05:30 IST

మండల కేంద్రమైన ముసునూరులో అక్రమంగా కారులో తరలిస్తున్న 286 తెలంగాణ మద్యం సీసాలను సీఐ రామచంద్రరావు పర్యవేక్షణలో, ఎస్సై రాజారెడ్డి సోమవారం దాడి చేసి పట్టుకుని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, కారును సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు.

తెలంగాణ మద్యం పట్టివేత
పట్టుబడిన మద్యం సీసాలతో పోలీసులు

ముసునూరు, డిసెంబరు 14: మండల కేంద్రమైన ముసునూరులో అక్రమంగా కారులో తరలిస్తున్న 286 తెలంగాణ  మద్యం సీసాలను సీఐ రామచంద్రరావు పర్యవేక్షణలో, ఎస్సై రాజారెడ్డి సోమవారం దాడి చేసి పట్టుకుని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, కారును సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. తెలంగాణ మద్యాన్ని మీడియాకు చూపిన నూజీవీడు డీఏస్పీ బి శ్రీనివాసులు మాట్లాడుతూ గుంటూరు జిల్లా సంగడిగుంటకు చెందిన షేక్‌ సర్ధార్‌ హస్సన్‌ తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి పాతబస్‌స్టాండ్‌ వద్ద కారు మెకానిక్‌ పనులు చేసుకుంటు జీవిస్తున్నాడు. ఎలాగైనా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి వైన్‌షాపు నుంచి 286 మద్యం సీసాలను కొనుగోలు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ధరకు అమ్ముకుందామని, చింతలపూడికి చెందిన ప్రసాద్‌ అనే వ్యక్తి రిపేర్‌ చేయమని ఇచ్చిన కారులో రెండు సూపర్‌ కవర్లలో మద్యం సీసాలను పెట్టుకుని, ముసునూరుకు చెందిన అనగాని రాంబాబు అనే వ్యక్తికి అమ్మడానికి వస్తున్న క్రమంలో పంచాయతీ కార్యాలయం వద్ద ఎస్సై తనిఖీ చేయగా రూ.40వేల విలువ గల 286 తెలంగాణ మద్యం సీసాలను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుని నిందుతుడు షేక్‌ సర్ధార్‌ హస్సన్‌, అనగాని రాంబాబులపై కేసు నమోదు చేసి, కారును సీజ్‌ చేసినట్లు ఆయన చెప్పారు. ఇద్దరు నిందుతులను కోర్టులో హాజరుపరచి, రిమాండ్‌కు పంపినట్లు డీఏస్పీ తెలిపారు 


Updated Date - 2020-12-15T06:00:56+05:30 IST