కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాలి

ABN , First Publish Date - 2020-12-30T06:18:57+05:30 IST

కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాల్సిన సమయం అసన్నమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాలి
బహిరంగ సభలో ప్రసంగిస్తున్న మధు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు

కోడూరు, డిసెంబరు 29 : కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాల్సిన సమయం అసన్నమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మండిపడ్డారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో  మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పి.మధు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్‌ చట్టాన్ని వెనక్కి తీసుకునేందుకు పోరాటాలు చేయటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కష్టజీవుల ప్రయోజనం కోసం నిరంతరం పోరాడేది సీపీఎం అన్నారు. పోరాటాల గడ్డ కోడూరులో 22ఏ జీవోను రద్దు చేసే వరకు త్వరలో ఒక కార్యచరణ కూడా రూపొందిస్తామన్నారు. రాజకీయ పదవుల కోసం టీడీపీ, వైసీపీ, జనసేన నేతలు మోడీ కాళ్లకు మొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మూడు పార్టీలను మట్టిలో కలపటానికి రైతులు, కౌలు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలో సముద్రతీర ప్రాంత మండలమైన కోడూరు నుంచి రైతుల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. ఈ బహిరంగ సభకు సీపీఎం మండల అధ్యక్షుడు పి.మోహనరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, తూర్పు కృష్ణా కార్యదర్శి ఆర్‌.రఘు, వై.నరసింహారావు, ఎం.హరిబాబు, సీహెచ్‌.రవిబాబు, అవనిగడ్డ, చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మండలాల సీపీఎం నాయకులు వాకా రామచంద్రరావు, శీలం నారాయణరావు, బండి ఆదిశేషు, వై.మధు  పాల్గొన్నారు.


Updated Date - 2020-12-30T06:18:57+05:30 IST