ప్రతిపక్షాలపై వైసీపీ కక్షపూరిత చర్యలు

ABN , First Publish Date - 2020-12-06T06:22:34+05:30 IST

ప్రతిపక్షాలపై వైసీపీ కక్షపూరిత చర్యలు

ప్రతిపక్షాలపై వైసీపీ కక్షపూరిత చర్యలు
ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

 టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడితే ఊరుకోం:  మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 5: ప్రతిపక్షాలపై వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, తనతో పాటు టీడీపీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి, పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజలు విసిగి పోయారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీనే అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయం వద్ద శనివారం మండల, నగర, గ్రామ, డివిజన్‌ స్థాయి, వివిధ అనుబంధ సంఘాల కమిటీల ఏర్పాట్లపై నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, నాయకుల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం చంద్రబాబుకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన జీ ప్లస్‌ 3 ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. వలంటీర్లతో టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు కేసులు పెట్టించేందుకు ప్రయత్నం చేశారని, ఇళ్ల స్థలాల పంపిణీలో అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసాద్‌, మునిసిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ పంచపర్వాల కాశీవిశ్వనాథం, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు లంకే నారాయణ ప్రసాద్‌, మాజీ కౌన్సిలర్లు కొట్టె వెంకట్రావు, బత్తిన దాసు, టీడీపీ రూరల్‌ పార్టీ అధ్యక్షుడు కుంచే నాని, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇలియాస్‌ పాషా, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ గోపు సత్యనారాయణ, టీడీపీ జిల్లా కార్యదర్శి పి.వి. ఫణికుమార్‌, కరెడ్ల సుశీల, వాలిశెట్టి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-06T06:22:34+05:30 IST