-
-
Home » Andhra Pradesh » Krishna » Local elections are a big challenge for the district administration
-
ఎలక్షణక్షణం..
ABN , First Publish Date - 2020-03-13T10:09:07+05:30 IST
స్థానిక ఎన్నికలు జిల్లా యంత్రాంగానికి పెద్ద సవాల్‌గా మారాయి. సార్వత్రిక సమరం కంటే రెట్టింపు పని చేయాల్సి వస్తోంది.

అందరికీ పరుగులే
అభ్యర్థుల్లో ఉత్కంఠ
అధికారుల్లో టెన్షన్
ఒకేసారి నాలుగు ఎన్నికలు
30,31 తేదీల్లో పరోక్ష ఎన్నికలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): స్థానిక ఎన్నికలు జిల్లా యంత్రాంగానికి పెద్ద సవాల్‌గా మారాయి. సార్వత్రిక సమరం కంటే రెట్టింపు పని చేయాల్సి వస్తోంది. పక్షం రోజుల వ్యవధిలో ఎంపీటీసీ, జడ్‌పీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలన్నింటినీ నిర్వహించాల్సి రావటంతో అధికారులకు కంటిపై కనుకు ఉండడం లేదు. ఒకేసారి ఇన్ని ఎన్నికలు నిర్వహించాల్సి రావటం ఇబ్బంది అయినా.. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలతో షెడ్యూల్ ప్రకారం నడచుకుంటూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లను ఒక కొలిక్కి తీసుకొచ్చారు. గురువారం జెడీపీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్ర్కూటినీ పూర్తికాగా, నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి పాఠకుల కోసం ఎన్నికల నిర్వహణకు సంబంధించి అదనపు సమాచారం....
30, 31 తేదీల్లో పరోక్ష ఎన్నికలు :
జిల్లా, మండల పరిషత్‌లు, మునిసిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ నెల 30, 31 తేదీల్లో జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించనుంది. ముందుగా 30వ తేదీన జడ్పీ సభ్యులంతా జిల్లా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లను, మండల పరిషత్ సభ్యులు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్‌లను ఎన్నుకుంటారు. 31న విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు.
ఒకే దశలో పరిషత్, మునిసిపల్ పోరు.. రెండు దశల్లో ‘పంచాయతీ’
జిల్లాలో స్థానిక సంగ్రామం సమర్థవంతంగా నిర్వహించటానికి జిల్లా యంత్రాంగం వినూత్న విధానాన్ని ఎంపిక చేసుకుంది. ఎంపీటీసీ /జడ్‌పీటీసీ ఎన్నికలను, కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికలను జిల్లా యంత్రాంగం ఒకే దశలో నిర్వహించనుంది. జిల్లాలోని 53 మండలాల్లో 49 జడ్‌పీటీసీలు ఉన్నాయి. వీటిలో మచిలీపట్నం, జగ్గయ్యపేట, పెనమలూరు జడ్‌పీటీసీలకు మినహా మిగిలిన 46 జడ్‌పీటీసీలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. 812 ఎంపీటీసీలకు గానూ 723 ఎంపీటీసీలకు, 980 గ్రామ పంచాయతీలకు గానూ 961 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 9990 వార్డులు ఉండగా, 9692 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 298 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని ఎంపీటీసీ /జడ్‌పీటీసీ, మున్పిపల్ ఎన్నికలను తొలి దశలోనూ, గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు దశల్లోనూ నిర్వహించాలని నిర్ణయించారు.