నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-12-03T06:41:01+05:30 IST
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్ఐసీ ఉద్యోగులు బుధవారం ప్రదర్శన నిర్వహించారు.

మచిలీపట్నం టౌన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్ఐసీ ఉద్యోగులు బుధవారం ప్రదర్శన నిర్వహించారు. ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం నాయకులు జి. కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ఎల్ఐసీ రిటైర్డు ఉద్యోగుల సంఘ నాయకులు ఎస్. ధనుంజయరావు, ఐసీఈయూ అధ్యక్షుడు జె. సుధాకర్, యూనియన్ జాయింట్ సెక్రటరీ టి.చంద్రపాల్, ఎల్.రాజశేఖర్, ఎం.వై.వి.ఎ్‌స.ఆర్.సుబ్రహ్మణ్యం, బి.శ్రీనివాసరావు, బి.హెచ్.మాధుర్ పాల్గొన్నారు.