ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-03T06:30:43+05:30 IST

ఇళ్ల స్థలాల పంపిణీకి ఎటువంటి అవరోధాలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సబ్‌ కలెక్టరు హెచ్‌ఎం ధ్యానచంద్ర సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు తీసుకోవాలి
మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ ధ్యానచంద్ర

ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు తీసుకోవాలి

పాయకాపురం, డిసెంబరు 2 : ఇళ్ల స్థలాల పంపిణీకి ఎటువంటి అవరోధాలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సబ్‌ కలెక్టరు హెచ్‌ఎం ధ్యానచంద్ర సంబంధిత అధికారులను ఆదేశించారు.  వీఎంసీ లేఅవుట్ల అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సబ్‌ కలెక్టరు కార్యాలయంలో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ఈనెల 25న పేదల సొంతింటి కలను సాకారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. నగరంలోని 27521మందికి ఇళ్ల స్థలాలు అందించేందుకు సున్నంపాడు, మునగ పాడు, కవులూరు హెచ్‌ ముత్యాలపాడులో నిర్ధేశించిన 521.22 ఎకరాల్లో లే అవుట్‌ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. తహసీల్దార్‌ షేక్‌ ఇంతియాజ్‌ బాషా, ఎంపీడీవో అనురాధ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T06:30:43+05:30 IST