మున్సిపల్‌ కమిషనర్‌పై దాడి

ABN , First Publish Date - 2020-12-29T06:14:26+05:30 IST

మార్నింగ్‌ వాక్‌కు వెళుతున్న మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్యపై కొందరు పారిశుధ్య కార్మికులు దాడి చేశారు.

మున్సిపల్‌ కమిషనర్‌పై దాడి
మునిసిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న పారిశుధ్య కార్మికులు

పెడన, డిసెంబరు 28 : మార్నింగ్‌ వాక్‌కు వెళుతున్న మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్యపై కొందరు పారిశుధ్య కార్మికులు దాడి చేశారు. మహిళా కార్మికురాలు ముత్యాల లంకేశ్వరిపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ కార్మికులు  ఈ దాడికి పాల్పడ్డారు. తనపై జరిగిన దాడి గురించి అంజయ్య పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లంకేశ్వరి కూడా కమిషనర్‌పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. లంకేశ్వరికి మద్దతుగా కార్మికులు ఆందోళనకు దిగారు. కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. మాజీ కౌన్సిలర్లు అయూబ్‌ఖాన్‌, గరికముక్కు చంద్రబాబు తదితరులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో కార్మికులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. తాను లైంగికంగా వేధించానని లంకేశ్వరి చేసిన ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని కమిషనర్‌ ఖండించారు. తనపై జరిగిన దాడి వెనుక కుట్ర కోణం దాగి ఉందన్నారు. 


Updated Date - 2020-12-29T06:14:26+05:30 IST