మల్లేశ్వరస్వామికి లక్ష బిల్వార్చన

ABN , First Publish Date - 2020-12-15T05:46:10+05:30 IST

మల్లేశ్వరస్వామికి లక్ష బిల్వార్చన

మల్లేశ్వరస్వామికి లక్ష బిల్వార్చన

విజయవాడ, ఆంధ్రజ్యోతి : కార్తీక మాసం చివరి సోమవారం ఇంద్రకీలాద్రికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఈవో ఎంవీ సురేష్‌బాబు దంపతులు పాల్గొని పూజలు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మల్లేశ్వరుడికి లక్ష బిల్వార్చన జరిగింది. రోజూ నిర్వహించే శాంతి కల్యాణం, చండీహోమం, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవావర్ణార్చన తదితర ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ కనువిందుగా నిర్వహించారు. చిరంజీవి రిజుత నృత్య నీరాజనాలు, బీవీ దుర్గాభవానీ గాత్రం అందించగా, కూచిపూడి నృత్యకారిణి వైఎస్‌వీఎన్‌ అనూరాధ శిష్యబృందం రిజుత, తన్మయి, సహస్ర, త్రిధార, గోదా, హర్షిత, ప్రణీతల నృత్యరూపకం ఆకట్టుకుంది. సాయంత్రం నటరాజస్వామి ఆలయం పక్కన సహస్ర దీపాలంకరణ (ఊంజల్‌ సేవ) నిర్వహించారు. మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద అర్చకులు, వేదపండితులు ఆకాశ దీపాన్ని వెలిగించారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా దుర్గగుడిలోని యాగశాలలో మంగళవారం ఉదయం 10 గంటలకు రుద్రహోమం నిర్వహించనున్నారు. అనంతరం పూర్ణాహుతి చేస్తారు. 

Updated Date - 2020-12-15T05:46:10+05:30 IST