-
-
Home » Andhra Pradesh » Krishna » krishnaiah
-
కౌలు రైతు కుటుంబాలకు పరిహారం అందజేత
ABN , First Publish Date - 2020-12-28T06:21:48+05:30 IST
బాధిత కుటుంబ సభ్యులను కలిసి చెక్కులు అందించారు.

అవనిగడ్డ టౌన్, చల్లపల్లి: నివర్ తుఫాను కారణంగా పంట నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడిన కొత్తపేట గ్రామానికి చెందిన కౌలు రైతు ముళ్లపూడి వెంకట కృష్ణయ్య కుటుంబానికి, చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు చింతలమడకు చెందిన సుదాని సాంబశివరావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.7 చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఆర్డీవో ఖాజావలి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆదివారం బాధిత కుటుంబ సభ్యులను కలిసి చెక్కులు అందించారు. మోదుమూడిలో ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతు ఓలేటి ఆదిశేషు కుటుంబానికి కూడా కొద్ది రోజుల్లోనే పరిహారాన్ని అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. డీఎస్పీ మహబూబ్ బాషా, తహసీల్దార్ శ్రీను నాయక్, జిల్లా వ్యవసాయాధికారి మోహన్ రావు, ఏడీఏ వెంకట మణి, వైసీపీ నేతలు సింహాద్రి వెంకటేశ్వరరావు, చింతలపూడి లక్ష్మి నారాయణ, చింతలపూడి బాలు, పులిగడ్డ చంద్ర, ఇన్‌చార్జి ఆర్‌ఐ శేషుబాబు పాల్గొన్నారు.