కృష్ణా: మైనర్‌కు యువకుడి వేధింపులు
ABN , First Publish Date - 2020-12-30T14:34:21+05:30 IST
జిల్లాలోని కొండపల్లికి చెందిన మైనర్ పట్ల ఓ యువకుడు లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కృష్ణా: జిల్లాలోని కొండపల్లికి చెందిన మైనర్ పట్ల ఓ యువకుడు లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మచిలీపట్టణంకు చెందిన హర్షవర్ధన్ యువకుడు వేధిస్తున్నాడంటూ చిలకలపూడి పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమీప బంధువుల వివాహానికి బాలిక హాజరవగా యువకుడు ఫోటోలు తీసి లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.