పెడన మున్సిపల్ కమిషనర్‌పై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-12-30T13:18:27+05:30 IST

పెడన మున్సిపల్ కమిషనర్‌పై బెదింపుల కేసు నమోదు అయ్యింది.

పెడన మున్సిపల్ కమిషనర్‌పై కేసు నమోదు

కృష్ణా: పెడన మున్సిపల్ కమిషనర్‌పై బెదింపుల కేసు నమోదు అయ్యింది. రెండు రోజుల క్రితం తనను వేధిస్తున్నాడంటూ పెడన మున్సిపల్ కమిషనర్‌పై మహిళా మున్సిపల్ వర్కర్ దాడికి ప్రయత్నించింది. దీంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు. మహిళను విచారించగా మున్సిపల్ కమిషనర్ బెదిరింపుల విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మున్సిపల్ కమిషనర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-12-30T13:18:27+05:30 IST