కృష్ణా జిల్లాలో వరుసగా హుండీల చోరీ

ABN , First Publish Date - 2020-10-08T17:22:41+05:30 IST

జిల్లాలోని మైలవరం మండలం చంద్రాలలోని భావన రుషి దేవాలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు.

కృష్ణా జిల్లాలో వరుసగా హుండీల చోరీ

కృష్ణా: జిల్లాలోని మైలవరం మండలం చంద్రాలలోని భావన రుషి దేవాలయంలో దుండగులు చోరీకి తెగబడ్డారు. హుండీని అపహరించిన దుండగులు అందులోని నగదును తీసుకునిన హుండీని కిలో మీటర్ దూరంలో పడేసి పరారయ్యారు. హుండీలో  సుమారు రూ.25 వేల నగదు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మండలంలో వరసగా ఆలయాల్లో హుండీలు చోరీకి గురి అవుతుండటంతో ప్రజలు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-10-08T17:22:41+05:30 IST