అంజుమన్ భవనాన్ని అభివృద్ధి చేస్తాం
ABN , First Publish Date - 2020-11-26T06:14:22+05:30 IST
ముస్లింల అవసరాలు తీర్చే విధంగా అంజుమన్ భవనాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

గుడివాడ, నవంబరు 25 : ముస్లింల అవసరాలు తీర్చే విధంగా అంజుమన్ భవనాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. మంత్రి కొడాలి నానిని అంజుమన్ కమిటీ అధ్యక్షుడు రహమతుల్లా షరీఫ్, ఉపాధ్యక్షుడు సర్దార్ బేగ్, కార్యదర్శి సర్తాజ్ పాషా, సంయుక్త కార్యదర్శి షేక్ బాజీ, గౌరవధ్యక్షుడు, ప్రభుత్వ ఖాజీ ఖలీల్ రెహ్మాన్, సభ్యులు వహీద్, రహీంఖాన్, రజాక్ తదితరులు కలిశారు. అంజుమన్ భవన్‌లో మొదటి అంతస్తులో భోజన వసతికి వినియోగించుకునేలా నిర్మాణాలు చేపట్టాలని కోరారు. మదర్సా నిర్వహణకు ఇబ్బందులు లేకుండా రెండవ ఫ్లోర్‌లో రెండు గదులు నిర్మించాలని కోరారు. దీనిపై మంత్రి కొడాలి నాని కమిషనర్ సంపత్‌కుమార్‌తో మాట్లాడారు. అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు.