డబ్బుంటే మరో అంతస్థు నిర్మించుకోవచ్చు

ABN , First Publish Date - 2020-12-29T07:13:22+05:30 IST

ఇళ్ల స్థల పట్టాల లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇళ్లను నిర్మించి ఇస్తోందని, వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడితే భవిష్యత్తులో మరో అంతస్థును నిర్మించుకోవచ్చని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు.

డబ్బుంటే మరో అంతస్థు నిర్మించుకోవచ్చు
మోటూరులో ఇళ్ల పట్టాలు అందజేస్తున్న మంత్రి కొడాలి నాని

 గుడివాడ రూరల్‌, డిసెంబరు 28 : ఇళ్ల స్థల పట్టాల లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇళ్లను నిర్మించి ఇస్తోందని, వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడితే భవిష్యత్తులో మరో అంతస్థును నిర్మించుకోవచ్చని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు. సోమవారం గుడివాడ రూరల్‌ మండలం మోటూరు గ్రామంలో రూ.1.80 లక్షల వ్యయంతో చేపట్టే ఇంటి నిర్మాణాలకు మంత్రి కొడాలి నాని శంకుస్థాపన చేశారు. మోటూరులో 253 మందికి ఇంటి స్థల పట్టాలను పంపిణీ చేశారు.  దుక్కిపాటి శశిభూషణ్‌, పాలడుగు రాంప్రసాద్‌, మట్టా జాన్‌ విక్టర్‌, పెయ్యల అదాం, మేకల సత్యనారాయణ, పొట్లూరి మురళీ, ఇమ్మడి అశోక్‌కుమార్‌, గొర్రె పాండురంగారావు, గంటా సురేష్‌, గంటా శ్రీను పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T07:13:22+05:30 IST