-
-
Home » Andhra Pradesh » Krishna » kdccb one year celebration
-
ఏడాదిలోనే కేడీసీసీబీ లాభాల్లో వృద్ధి
ABN , First Publish Date - 2020-12-06T06:32:09+05:30 IST
ఏడాదిలోనే కేడీసీసీబీ లాభాల్లో వృద్ధి

మచిలీపట్నం టౌన్, డిసెంబరు 5: ‘‘కృష్ణా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు దేశంలో ప్రథమ సాథనంలో నిలిచేందుకు చేరువైంది. గతంలో ఉన్న రూ. 5513 కోట్లు వ్యాపారాన్ని, రూ. 6695 కోట్లకు పెంచాం. వృద్ధి రేటు 21.44 శాతానికి పెరిగింది.’’ అని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కేడీసీసీ పాలకవర్గం ఏర్పడి ఏడాదైన సందర్భంగా శనివారం పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. కేకు కట్ చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో పనిచేస్తున్న సెక్రటరీలు ఒకే గ్రామంలో రిటైరవుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని సెక్రటరీల బదిలీలు చేపట్టామన్నారు. ఇందుకు హెచ్‌ఆర్ పాలసీని తయారు చేసి సీఎం జగన్మోహనరెడ్డి ముందు ఉంచామన్నారు. 2017లో రూ. 29.7 కోట్ల స్కామ్ జరిగిందని, ఈ స్కామ్‌కు బాధ్యులైన వారి నుంచి రూ. 4.78 కోట్ల వరకు రికవరీ చేశామన్నారు. మిగిలిన సొమ్ము రికవరీ చేసేందుకు ఈ కేసును అవసరమైతే సీబీసీఐడీకి అప్పగిస్తామన్నారు. సీఈవో రాజయ్య, జీఎం చంద్రశేఖర్, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్లు పాల్గొన్నారు.