-
-
Home » Andhra Pradesh » Krishna » kb foundation
-
కేబీ ఫౌండేషన్ నిర్వాహకుల అరెస్టు
ABN , First Publish Date - 2020-12-15T05:59:34+05:30 IST
ఒకటికి పది రెట్లు నగదు ఇస్తామంటూ కేబీ ఫౌండేషన్ ముసుగులో లక్షల్లో టోపీ పెట్టిన మోసగాళ్లను అరెస్టు చేసినట్లు కైకలూరు సీఐ కేవీవీఎల్ నాయుడు తెలిపారు.

ఒకటికి పది రెట్లు ఇస్తామంటూ రూ.25 లక్షల దోపిడీఫ అరెస్టు చేసిన పోలీసులు
కైకలూరు, డిసెంబరు14 : ఒకటికి పది రెట్లు నగదు ఇస్తామంటూ కేబీ ఫౌండేషన్ ముసుగులో లక్షల్లో టోపీ పెట్టిన మోసగాళ్లను అరెస్టు చేసినట్లు కైకలూరు సీఐ కేవీవీఎల్ నాయుడు తెలిపారు. సోమవారం కైకలూరు పోలీ్‌సస్టేషన్‌లో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్ సమయంలో కేబీ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. వెయ్యికి పదివేలు, పది వేలుకు లక్ష, రుణాలు ఇస్తామని పలు వాయిదాల్లో వాటిని తిరిగి చెల్లించాలంటూ సుమారు 45 మంది బాధితుల నుంచి రూ.25 లక్షలు దోచుకున్నారు. ఈ స్కీమ్‌కు కైకలూరుకు చెందిన పుప్పాల శ్యామల, ఆమె మేనకోడలు బొడ్డు సువర్చల ఆమె భర్త కిరణ్‌కుమార్ నగదు కట్టారు. శ్యామల ద్వారా కైకలూరు ప్రాంతంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ స్కీమ్ తెలియజేసి వారి నుంచి వెయ్యి, ఐదు వేలు, పది వేల రూపాయలు కట్టించుకుని ప్రజలను నమ్మబలికేందుకు వారి ఖాతాల్లో నగదు జమచేశారు. వీరికి ఏడుగురు ఏజెంట్లుగా వ్యవహరించారు. పుప్పాల శ్యామల, పుప్పాల దుర్గాప్రసాద్, కటికన పద్మావతి, టేకు లక్ష్మీ, పట్టపు సావిత్రి, యామాల ఆదిలక్ష్మీ, అన్నం వెంకటేశ్వరరావు వీరంతా పలువురి నుంచి ఈ సంస్థకు ఏజెంట్లుగా వ్యవహరించారు. కైకలూరుకు చెందిన సాతరబోయిన వీరాస్వామి పుప్పాల శ్యామల ద్వారా ఈ స్కీమ్‌కు డబ్బులు చెల్లించారు. రోజులు గడుస్తున్నప్పటికీ నగదు జమకాకపోవడంతో మోసంగా గుర్తించి సెప్టెంబరు 19న కైకలూరు టౌన్ ఎస్సై షణ్ముఖసాయికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పలు బృందాలుగా హైద రాబాద్, వైజాగ్, తదితర ప్రాంతాల్లో గాలించారు. బుల్లితెరలో సీరియల్ చూడడమేకాక దానిలోని విధానాలను అనుసరిస్తూ రోజుకో సిమ్‌కార్డు మార్చుకుంటూ పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. ఎట్టకేలకు పోలీసులు వలపన్ని వారిని అరెస్టుచేసి కోర్టుకు హాజరు పరిచారు. బాధితులు ఎవరైనా ఉంటే సంప్రదించాలని సీఐ కోరారు.