రైతు వ్యతిరేక ప్రభుత్వాల మనుగడ కష్టం

ABN , First Publish Date - 2020-12-27T05:42:08+05:30 IST

రైతు వ్యతిరేక ప్రభుత్వాల మనుగడ కష్టం

రైతు వ్యతిరేక ప్రభుత్వాల మనుగడ కష్టం
మాట్లాడుతున్న చలసాని వెంకట రామారావు

నూజివీడు టౌన్‌: వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకునే వరకు రైతుల ఉద్యమాలకు మద్దతుగా నిరసనలు, ధర్నాలు కొనసాగిస్తామని సీపీఐ రాష్ట్ర నాయకుడు చలసాని వెంకటరామారావు, రాష్ట్ర రైతు సంఘం నాయకులు కొమ్మన నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబించే ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని వారు అభిప్రాయపడ్డారు. రాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నూజివీడులో శనివారం అభ్యుదయ రచయతల సంఘం, మానవత చారిటబుల్‌ ట్రస్ట్‌, సత్య నృత్య కళాశాల, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఆధ్వర్యంలో కలం గళం నృత్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజు, శిఖా ఆకాష్‌, ఎస్‌కేడీ ప్రసాద్‌, ఇబ్రహీం, ఈమని శేషయ్య, కవులు, కళాకారులు, మేధావులు పాల్గొన్నారు. 
Updated Date - 2020-12-27T05:42:08+05:30 IST