ధాన్యం కొనుగోలుకు గోనె సంచులు, వాహనాల ఏర్పాటు

ABN , First Publish Date - 2020-12-06T05:59:00+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అవసరమైన గోనె సంచులు, ధాన్యం రవాణాకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీలత చెప్పారు.

ధాన్యం కొనుగోలుకు గోనె సంచులు, వాహనాల ఏర్పాటు

విజయవాడ, సిటీ : జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అవసరమైన గోనె సంచులు, ధాన్యం రవాణాకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీలత చెప్పారు. డయల్‌ యువర్‌ జేసిలో భాగంగా శనివారం 25 మంది రైతులు ఫోన్‌ చేయగా అందులో ధాన్యం కొనుగోలుకు సం బంధించి పది మంది రైతులు తమ సమస్యలను జేసీ దృష్టికి తీసుకొచ్చారు. ఇబ్రహీంపట్నం మం డలం గుంటుపల్లి నుంచి పెద్దర్ల సుబ్బారావు మా ట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి గోనె సంచులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జేసి స్పందిస్తూ వెంటనే గోనె సంచుల ఏర్పాటుతో పాటు రవాణా కోసం వాహనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవాడ రూరల్‌, ఘంటసాల, ముది నేపల్లి, గన్నవరం, కృత్తివెన్ను మండలాల నుంచి రైతులు భాస్కరరెడ్డి, వెంకటేశ్వరరావు, సాయి వెంకటరమణ, శ్రీనివాసరావు, అర్జునుడు, పరసా నాగబాలాజీ మాట్లాడుతూ తమ పంట వివరాలు ఈ-క్రాప్‌ అవలేదని తెలియజేయడంతో వ్యవసాయ శాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిస్తామని జేసి సమాధానమిచ్చారు. తిరు వూరు మండలం ముష్టికుంట్ల నుంచి వెంకటసత్య నారాయణ మాట్లాడుతూ ఎంటీయూ 1262 రకం ధాన్యం కొనుగోలు చేయాలని కోరగా జేసీ స్పంది స్తూ సంబంధిత ధాన్యం కొనుగోలు చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులను జేసి ఆదేశించారు. మండవల్లి మండలం లింగాల నుంచి పలువురు రైతులు మాట్లాడుతూ ధాన్యం తాలూక నగదు త్వరగా జమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరగా ఇప్పటికే చర్యలు తీసుకున్నామని జేసీ స మాధానమిచ్చారు. కైకలూరు మండలం అచ్చవరం నుంచి శ్యామలరావు అనే రైతు మాట్లాడుతూ తన ధాన్యం మధ్యవర్తి ద్వారా మిల్లుకు తోలానని ఇంకా నగదు జమకాలేదన్నారు. జేసీ స్పందిస్తూ మధ్యవ ర్తులు, దళారులను ఆశ్రయించవద్దని పదేపదే చెబుతున్నా వినటం లేదని ఇలాగే ఉంటే రైతులు నష్టపోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 6న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డయల్‌ యువర్‌ జేసి నిర్వహిస్తున్నట్లు జేసీ మాధవీలత తెలిపారు. రైతులు 0866-2577144 నెంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలను తెలియజేసి పరిష్కారం పొందవచ్చన్నారు. పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ కె.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:59:00+05:30 IST