శతకోటి లింగాల్లో బోడి లింగం.. కొడాలిపై పవన్ సెటైర్లు

ABN , First Publish Date - 2020-12-28T22:14:26+05:30 IST

గుడివాడ జంక్షన్‌లో మంత్రి కొడాలి నానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడ నడిబొడ్డున ఉండి చెబుతున్నానని, దాష్టికాలకు పాల్పడే ప్రజాప్రతినిధులను జనసేన ఎదుర్కొంటుందని వార్నింగ్ ఇచ్చారు.

శతకోటి లింగాల్లో బోడి లింగం.. కొడాలిపై పవన్ సెటైర్లు

కృష్ణా జిల్లా: గుడివాడ జంక్షన్‌లో మంత్రి కొడాలి నానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడ నడిబొడ్డున ఉండి చెబుతున్నానని, దాష్టికాలకు పాల్పడే ప్రజాప్రతినిధులను జనసేన ఎదుర్కొంటుందని వార్నింగ్ ఇచ్చారు. సోమవారం గుడివాడ పర్యటనలో మాట్లాడిన పవన్... ‘‘ఏదైనా ప్రశ్నిస్తే.. ఒక్కొక్కరూ బూతులు తిడుతుంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటి? నానియా? వైసీపీలో నానీలు ఎక్కువమంది. ఏదో ఒక నాని. ఏ నానో నాకు అర్థం కావడం లేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం. అనేక మంది నానిలలో ఒక నాని. ఎవరైతే మనకేంటి? శతకోటి నానిలలో ఒకరైన నానికి చెబుతున్నా. మీ సీఎం సాబ్‌కు చెప్పండి. జగన్ రెడ్డి గారికి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. వచ్చే శాసన సభ సమావేశాల్లోగా నష్టపోయిన రైతులకి రూ.35 వేల పరిహారం అందించకపోతే జనసైనికులతో కలిసి అస్సెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తాం’’ అంటూ సెటైర్ల వర్షం కురిపించారు.   


‘‘ఏంటయ్యా ఆయన పేరు? ఏదో నానిలే. ఏం గుర్తుపెట్టుకుంటాం. నానిలు ఎక్కువైపోయారు. రైతులకు కనీసం వెయ్యి రూపాయలు ఇచ్చాడా? ఇది ప్రజాస్వామ్యం. మనకు అన్యాయం జరిగినప్పుడు గళమెత్తే హక్కు మనకు ఉంది. భయపడితే పనులు అవ్వవు. నోరేసుకుని బూతులు తిడితే సహిస్తామా? పెట్టి పుట్టారా వాళ్లు? మాకేమైనా భయం అనుకున్నారా? మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి. అదేదో నాని గారట. మీ సీఎం సాబ్‌కు చిడతలు కొట్టింది చాలు. పని చేయవయ్యా ముందు. నన్ను తిట్టినా సంతోషమే. కానీ రైతులకు న్యాయం చేయండి. అలా కాకుండా నన్నుతిడితే... ఏం ప్రయోజనం. పద్ధతిగా ఉన్నారా ఉన్నారు. లేదా అసెంబ్లీ ముట్టడి ఖాయం’’ తనదైన స్టైల్లో కొడాలికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. Updated Date - 2020-12-28T22:14:26+05:30 IST