నేటి నుంచి జనసేన కార్యకర్తల సభ్యత్వ నమోదు ప్రారంభం

ABN , First Publish Date - 2020-11-19T14:31:06+05:30 IST

నేటి నుంచి నుండి 32 నియోజకవర్గాలలో జనసేన క్రియాశీల కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభంకానుంది.

నేటి నుంచి జనసేన కార్యకర్తల సభ్యత్వ నమోదు ప్రారంభం

అమరావతి: నేటి నుంచి నుండి 32 నియోజకవర్గాలలో జనసేన  క్రియాశీల కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభంకానుంది. సభ్యత్వ నమోదు రుసుము రూ.500 విధించడంతో పాటు, కార్యకర్తకు ఇన్సూరెన్స్ కింద ఐదు లక్షల రూపాయలు కవరేజ్‌ను ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. దీంతో ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు ఇలాంటి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వలేదని జనసైనికులు చెబుతున్నారు. ప్రతీ నియోజకవర్గంలో 200 మంది క్రియాశీల కార్యకర్తలను ఎంపిక చేయాలని పార్టీ అధినేత పవన్ ఆదేశించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని  నాదెండ్ల మనోహర్ ఈరోజు ప్రారంభించనున్నారు. 


Updated Date - 2020-11-19T14:31:06+05:30 IST