-
-
Home » Andhra Pradesh » Krishna » iso tour
-
మోడల్ సచివాలయాల్లో ఐఎస్‌వో బృందం
ABN , First Publish Date - 2020-11-25T06:19:46+05:30 IST
మల్లేల, చౌటపల్లి మోడల్ సచివాలయాలను ఐఎస్‌వో బృందం మంగళవారం సందర్శించింది. సచివాలయాలకు ఐఎస్‌వో 9000 సర్టిఫికెట్ జారీ నిమిత్తం బృందం సభ్యులు కార్తీకేయ, పృధ్వీరాజ్ సచివాలయాల పనితీరు పరిశీలించారు.

తిరువూరు, నవంబరు 24 : మల్లేల, చౌటపల్లి మోడల్ సచివాలయాలను ఐఎస్‌వో బృందం మంగళవారం సందర్శించింది. సచివాలయాలకు ఐఎస్‌వో 9000 సర్టిఫికెట్ జారీ నిమిత్తం బృందం సభ్యులు కార్తీకేయ, పృధ్వీరాజ్ సచివాలయాల పనితీరు పరిశీలించారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు తెలుసుకున్న అనంతరం వివిధ రికార్డుల నిర్వహణ, గ్రామస్థులకు ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి తెస్తున్న తీరు, సిబ్బంది పనితీరు తదితర అంశాలు పరిశీలించారు. సచివాలయాల్లో నిర్వహిస్తున్న రికార్డులు పరిశీలించి సం తృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నూజివీడు డివిజన్ పంచాయతీల అభివృద్ధి అధికారిణి గౌషియాబేగం, ఎంఈడీవో డి.బాలవెంకటేశ్వరరావు, పంచాయతీల కార్యదర్శులు హరికృష్ణ. ఫణిగోపాల్, వైసీపీ నాయకులు కలకొండ రవికుమార్, యరమల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. చాటాయ్రి : మోడల్ విలేజ్‌లుగా ఎంపికైన చాట్రాయి, బూరుగగూడెం గ్రామ సచివాలయాలను మంగళవారం ఐఎస్‌వో ఢిల్లీ ప్రతినిధి కార్తికేయ తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు లబ్ధిదా రులు ఎంపికలో పారదర్శకత, జవాబుదారీతనం తదితర అంశాలను పరిశీలించారు. సచివాలయాలు అందిస్తున్న ప్రజాసేవలు ప్రమాణాలకు సరిపోతే ఐఎస్‌వో ర్యాంక్‌కు సిఫార్సు చేస్తారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. ఎంపీడీవో నాగేశ్వరరావు, సచివాలయ సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కార్యదర్శులు కరుణాకర్, నాగరాజు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. చాట్రాయిలో రికార్డులు పరిశీలిస్తున్న ఐఎస్‌వో బృందం సభ్యుడు