అసమర్థ మంత్రి వెలంపల్లి

ABN , First Publish Date - 2020-09-16T09:23:21+05:30 IST

కనకదుర్గమ్మ గుడిలో అమ్మ వారి వెండి ఉత్సవ రఽథంపై మూడు వెండి సింహం విగ్రహాలు మాయం కావడానికి మం త్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

అసమర్థ మంత్రి వెలంపల్లి

విజయవాడ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : కనకదుర్గమ్మ గుడిలో అమ్మ వారి వెండి ఉత్సవ రఽథంపై మూడు వెండి సింహం విగ్రహాలు మాయం కావడానికి మం త్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్నేహితుడికి చెందిన మ్యాక్స్‌ సెక్యూరిటీస్‌ వైఫల్యమా? మంత్రి బినా మీ ఈవో సురేష్‌బాబు చేతివాటం కారణమా? అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్‌ ఎద్దేవా చేశారు.


వెండి రథంపై విగ్రహాలు మాయమైన విషయం తెలియదని సమాధానం చెప్పిన దుర్గగుడి ఈవో ఆ స్థానంలో ఎందుకున్నట్టు? అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో రథాలకు భద్రత పెంచి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచాలని ఆదేశించిన మంత్రి తన ఇంటి ముందున్న అమ్మవారి గుడిలో వెండి రధానికి భద్రత కల్పించలేని అసమర్థుడని మరోసారి రుజువవైందని ఆయన ఘాటుగా విమర్శించారు.


‘‘మీకు దమ్ముంటే బుధవారం ఉదయం భక్తుల ముందు.. మీడియా ముం దు రథాన్ని తెరిచి వెండి విగ్రహాలు ఉన్నాయో లేదో చూపించండి. రాత్రి పూట రేకులు, పట్టాలు తెచ్చి రథాన్ని  కప్పివేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

Updated Date - 2020-09-16T09:23:21+05:30 IST