స్వాతంత్య్ర స్ఫూర్తితో..

ABN , First Publish Date - 2020-08-16T10:46:13+05:30 IST

అమరుల స్ఫూర్తితో అమరావతి సాధిస్తామంటూ రాజధాని రైతులు పిడికిలి బిగించారు. దీక్షా శిబిరాల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా ని

స్వాతంత్య్ర స్ఫూర్తితో..

 తుళ్లూరు/తాడికొండ, ఆగస్టు 15 : అమరుల స్ఫూర్తితో అమరావతి సాధిస్తామంటూ రాజధాని రైతులు పిడికిలి బిగించారు. దీక్షా శిబిరాల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర సాధనకు కృషిచేసిన అమరుల చిత్రపటాలకు పూజలు చేశారు. జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్‌ చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం శనివారం 242వ రోజుకు చేరుకుంది.


పెదపరిమిలో న్యాయదేవత చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండల పొన్నెకల్లు, మోతడక గ్రామాల రైతులు, మహిళలు ఆందోళనలు కొనసాగించారు. సీపీఐ నేత ముప్పాళ్ల శివశంకరరావు తదితరులు పాల్గొన్నారు. అమరావతి ఉద్యమానికి ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం నాగులపాడుకు చెందిన రైతులు రూ.1,16,000ను రైతు పరిరక్షణ సమితి కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌కు అందజేశారు.


వేదనతో ఆగిన మరో గుండె

అమరావతిలో మరో రైతు గుండె ఆగింది. రాజధాని తరలిపోతుందనే ఆందోళనతో మందడానికి చెందిన తోకల సత్యనారాయణ (70) శనివారం మరణించారు. ఆయన తనకున్న ఎకరం భూమిని అమరావతి నిర్మాణానికి ఇచ్చారు. శుక్రవారం వరకు ఆయన ఉద్యమంలో పాల్గొన్నారు.

Updated Date - 2020-08-16T10:46:13+05:30 IST