హైవేలపై జర్నీ చేసే వారికి ముఖ్య గమనిక.. జనవరి 1 నుంచి ఫాస్టాగ్ లేకుంటే..

ABN , First Publish Date - 2020-12-28T17:44:42+05:30 IST

మరో నాలుగు రోజుల్లో ఫాస్టాగ్‌ అమలు తప్పనిసరి కాబోతోంది! ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 90శాతం వాహనాలకు ఫాస్టాగ్‌ వేయటం జరిగింది. టోల్‌ ప్లాజాల దగ్గర జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) తీసుకున్న గణాంకాల మేరకు ఆదివారం నాటికి ఈ మేరకు సగటు శాతం నమోదైంది

హైవేలపై జర్నీ చేసే వారికి ముఖ్య గమనిక.. జనవరి 1 నుంచి ఫాస్టాగ్ లేకుంటే..

కృష్ణా జిల్లాలో.. ఫాస్టాగ్‌ 90శాతం పూర్తి

ఫాస్టాగ్‌ వేయించుకున్న వాటిలో ఎక్కువగా రవాణా వాహనాలే!

వ్యక్తిగత వాహనదారులే 8శాతం వరకు ఉంటారని అంచనా 

మరో నాలుగు రోజులు మాత్రమే సమయం

తర్వాత జరిమానాలు లేవు.. వాహనాన్ని వెనక్కి పంపించటమే!


ఆంధ్రజ్యోతి, విజయవాడ : మరో నాలుగు రోజుల్లో ఫాస్టాగ్‌ అమలు తప్పనిసరి కాబోతోంది! ఇప్పటి వరకు  కృష్ణా జిల్లా వ్యాప్తంగా 90శాతం వాహనాలకు ఫాస్టాగ్‌ వేయటం జరిగింది. టోల్‌ ప్లాజాల దగ్గర జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) తీసుకున్న గణాంకాల మేరకు ఆదివారం నాటికి ఈ మేరకు సగటు శాతం నమోదైంది. 4రోజుల్లో మిగిలిన 10శాతం వాహనదారులు కూడా తక్షణం తమ వాహనాలకు ఫాస్టాగ్‌ వేయించాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


నెలరోజులుగా టోల్‌ ప్లాజాల మీదుగా రాకపోకలు సాగించే వాహనాల్లో ఎక్కువ శాతం రవాణా వాహనాలే ఫాస్టాగ్‌ వేయిం చుకున్నాయి. కేవలం 2శాతం వాహనాలు మాత్రమే వేయించుకోవాల్సి ఉందని సమా చారం. మిగిలిన 8 శాతం వాహనాల్లో వ్యక్తిగత వాహనాలు మాత్రమే ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఫాస్టాగ్‌ వేయించుకోని వాటిలో ఎక్కువగా వ్యక్తిగత వాహనాలు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. ఇవి కూడా రోజువారీ తిరిగేవి కావు, ప్రత్యేక సందర్భాల్లో తిరిగేవి మాత్ర మే. నిత్యం కదలికలు ఉండే వాహనాల్లో నూరు శాతం ఫాస్టాగ్‌ పూర్తయినట్లేని, నూతన సంవత్సరం నుంచి ఫాస్టాగ్‌ను ప్రారంభించటం ఖాయమని అధికారులు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా టోల్‌ ప్లాజాల దగ్గర క్యాష్‌ లైన్లను తీసేస్తామన్నారు. 


ఇబ్బందులూ ఉన్నాయి..

జిల్లాలో పొట్టిపాడు, కలపర్రు, బాడవ, చిల్లకల్లు తదితర టోల్‌ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ఎక్విప్‌మెంట్‌ పరంగా కొన్ని ఇబ్బందులున్నాయి. కొన్ని సార్లు ఫాస్టాగ్‌ను ఇవి రీడ్‌ చేయలేకపోవడంతో గేట్లు తెరచుకోవటం లేదు. దీంతో మాన్యువల్‌గా హ్యాండ్‌ మెషీన్లతో స్కాన్‌ చేయాల్సి వస్తోంది. జనవరి ఫస్ట్‌ నాటికి ఎట్టి పరిస్థితుల్లో మెషీనరీ బాగా పనిచేసేలా టోల్‌ ప్లాజాల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ అధికారులు ఆదేశించారు. 


జరిమానాలు లేవు.. వెనక్కే..

జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌ లేకుండా ఏదైనా వాహనం టోల్‌ ప్లాజా వద్దకు వస్తే రెట్టింపు చార్జీ వసూలు చేయాలని గతం లో కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రస్తుతం వాటిని సవరించారు. జరిమానా లేకుండా వాహనాన్ని తిరిగి వెనక్కు పంపించివేయాలని ఆదేశాలు వచ్చాయి. 


వ్యక్తిగత వాహనదారులు త్వరపడాలి: జీవీ నారాయణ, ఎన్‌హెచ్‌ పీడీ 

ఫాస్టాగ్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఎంతో సమయం లేదు. ఉన్న సమాచారం మేరకు 90 శాతం ఫాస్టాగ్‌ పూర్తయింది. కేవలం 10 శాతమే మిగిలి ఉంది. అది కూడా వ్యక్తిగత వాహనాలకు సంబంధించినవి. టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ వేయించుకోవటానికి వీలుగా కౌంటర్‌ ఉంది. ఫాస్టాగ్‌ లేకుంటే రెట్టింపు ఫీజులు ఏమీ లేదుగానీ వాహనాన్ని మాత్రం వెనక్కి పంపేస్తాం.

Updated Date - 2020-12-28T17:44:42+05:30 IST