ట్రిపుల్‌ఐటీ ప్రవేశ ఫలితాల్లో సత్తాచాటిన జిల్లా విద్యార్థులు
ABN , First Publish Date - 2020-12-13T06:29:12+05:30 IST
రాజీవ్‌గాంధీ వర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ట్రిపు ల్ ఐటీ ఎంట్రన్స్) ఫలితాల్లో కృష్ణా జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.

విజయవాడ-ఆంధ్రజ్యోతి : రాజీవ్‌గాంధీ వర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ట్రిపు ల్ ఐటీ ఎంట్రన్స్) ఫలితాల్లో కృష్ణా జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. బాలుర విభాగంలో నూజివీడుకు చెందిన పిన్నిబోయిన వెంకట సుబ్బా రావు 96 మార్కులతో రాష్ట్రస్థాయిలో పదో ర్యాంకు సాధించగా బాలికల విభాగంలో విజయవాడకు చెం దిన కొండేటి రుక్మిణి 94 మార్కులతో రాష్ట్రస్థాయిలో 11వ ర్యాంకు సాధించింది. కమ్యూనిటీ విభాగంలో నూజివీడుకు చెందిన డేరం గుల సుజిత్ (బీసీ-ఎ) రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకును సొంతం చేసుకున్నా రు. ప్రభుత్వం రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఆర్‌జీయూకేటీ-2020)ను నిర్వహించింది. ఈనెల 5న నిర్వహిం చిన ఆర్‌జీయూకేటీ-2020 పరీక్ష ఫలితాలు శనివారం ఆర్‌అండ్‌బీ భవన్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. జిల్లాకు చెందిన 3,230 మంది బాలురు, 2,977 మంది బాలికలు కలిపి మొత్తం 6,207 మంది విద్యార్థులు ఆ పరీక్ష రాయగా.. 96.14 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 362 మంది జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 12 మంది విద్యార్థులు 90 పైగా మార్కులు సాధించగా.. 107 మంది విద్యార్థులు 81 నుంచి 90 మధ్య లో మార్కులు సాధించారు. మరో 243 మంది విద్యార్థులు 71 నుంచి 80 మధ్యలో మార్కులను సాధించారు.అర్హత సాధించిన విద్యార్థులకు వచ్చే జన వరి 4 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించి.. రెండో వారం నుంచి తరగతులు ప్రారంభించేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు.