ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోలేదు

ABN , First Publish Date - 2020-08-20T10:52:50+05:30 IST

ప్రభుత్వ నిబంధనలను రమేష్‌ ఆసుపత్రి పూర్తిగా ఉల్లంఘిం చిందంటూ స్వర్ణాప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటనపై నియమించిన విచారణ కమిటీ

ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోలేదు

విజయవాడ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ  నిబంధనలను రమేష్‌ ఆసుపత్రి పూర్తిగా ఉల్లంఘిం చిందంటూ స్వర్ణాప్యాలెస్‌  అగ్ని ప్రమాద ఘటనపై నియమించిన విచారణ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు, చట్టాల గురించి తెలిసి కూడా ధనార్జన కోసం ఉద్దేశ పూర్వకంగా,  ఉల్లంఘిం చిందని, కొవిడ్‌ వైద్య చికిత్స కోసం నిర్దేశించిన ప్రొటోకాల్‌ను నిర్లక్ష్యం చేసిందని పేర్కొంది.


స్వర్ణాప్యాలెస్‌ బిల్డింగ్‌కు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ కూడా లేకుండా ప్రభుత్వ నియమాలను, నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుపుతున్నారని తెలిపారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కట్టాల్సిన రూ. 33.69 లక్షల పన్ను బకాయిలను కూడా కట్టలేదని విచారణ కమిటీ నివేదికలో పేర్కొంది. 

Read more