జిల్లాలో 16 మంది గుర్తింపు

ABN , First Publish Date - 2020-04-01T09:32:46+05:30 IST

ఢిల్లీలో ప్రార్థనల్లో పాల్గొని జిల్లాకు తిరిగివచ్చిన వారి కారణంగా కరోనా వైరస్‌ వ్యాపిస్తోందనే ప్రచారంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు.

జిల్లాలో 16 మంది గుర్తింపు

మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి, మార్చి 31 : ఢిల్లీలో ప్రార్థనల్లో పాల్గొని జిల్లాకు తిరిగివచ్చిన వారి కారణంగా కరోనా వైరస్‌ వ్యాపిస్తోందనే ప్రచారంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. ఈ ఘటనపై ఎస్పీ పరిధిలో ఏ ప్రాంతం నుంచి ఎంత మంది వెళ్లారు. వారి ఫోన్‌ నెంబర్లు, చిరు నామాలు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు సేకరించారు.  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి (విజయవాడ మినహా) 16 మంది ఢిల్లీ వెళ్లి వచ్చినట్లు విచారణలో తేలింది. ఆరోగ్య పరిస్థితులు, ఎవరెవరిని కలిశారు, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులపై  డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, ఇతర వైద్యులు, ఆశ వర్కర్లు, సచివాలయ సిబ్బంది మంగళవారం ఆరా తీశారు.  శాంపిల్స్‌ సేకరించి పరీక్షల కోసం పంపారు.


ఎవరూ ఇల్లు దాటి రావద్దని సూచించారు. మచిలీపట్నం టెంపుల్‌ కాలనీకి చెందిన ఇద్దరిని గన్నవరం క్వారంటైన్‌ సెంటరుకు తరలించారు.  వర్రెగూడెం నుంచి ఢిల్లీకి వెళ్లిన వ్యక్తి ఇంటికి వైద్యసిబ్బంది వెళ్లి వివరాలు  సేకరించారు. కుటుంబ సభ్యులు  తమ కుమారుడు ఢిల్లీలోనే ఉన్నాడని తెలపడంతో, డాక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం వీడియో కాల్‌ చేసి మాట్లాడి, ఢిల్లీలోనే ఉన్నట్లు నిర్థారించుకున్నారు. మచిలీపట్నంలో విగ్రహాలు తయారు చేసేందుకు ఇటీవల ఢిల్లీనుంచి ఓ వ్యక్తి వచ్చాడని, అతను ప్రస్తుతం బేబీసెంటరులో తలదాచుకుంటున్నాడనే సమాచారంతో అక్కడకు వెళ్లి వివరాలు సేకరించారు.


  విజయవాడ క్వారంటైన్‌కు 8 మంది

జగ్గయ్యపేట: ఢిల్లీలో జరిగిన మత సమావేశాలకు వెళ్లి వచ్చిన ఒక వర్గానికి చెందిన తొమ్మిది మందిని విజయవాడలోని క్వారంటైన్‌ సెంటర్లకు తరలించినట్టు తహసీల్దార్‌ రామకృష్ణ చెప్పారు. పట్టణానికి చెందిన ఆరుగురిని, గౌరవరానికి చెందిన ఇద్దరిని ప్రత్యేక వాహనాల్లో విజయవాడ, గన్నవరం క్వారంటైన్‌ సెంటర్లకు పంపామని తెలిపారు. ప్రాథమిక పరీక్షలు చేశారని, కరోనా లక్షణాలు బయట పడలేదని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయిస్తున్నట్టు తెలిపారు. వారు నివసించిన ప్రాంతాలను రెడ్‌జోన్లుగా పరిగణించినట్లు తెలిపారు.  


మంగొల్లు నుంచి ఒకరిని

మంగొల్లు (వత్సవాయి) :  ప్రార్థనలకు వెళ్లి వచ్చిన మంగొల్లు గ్రామస్థుడిని అధికా రులు గన్నవరం క్వారంటైన్‌కు తరలించారు. 


పెనమలూరు నుంచి 9 మంది

పెనమలూరు : ఢిల్లీ నుంచి కానూరు, తాడిగడప గ్రామాలకు వచ్చిన తొమ్మిది మందిని గుర్తించినట్లు తహసీల్దార్‌ భద్రు తెలిపారు. కానూరులో సనత్‌నగర్‌, పాత చెక్‌పోస్టు సెంటర్‌కు చెందిన ఏడుగురి ని గన్నవరం క్వారంటైన్‌కు, తాడిగడపకు చెందిన ఇద్దరిని విద్యాధర పురం క్వారంటైన్‌ సెంటర్‌కు పంపినట్లు తెలిపారు.  


నూజివీడు నుంచి ఐదుగురు...

నూజివీడు టౌన్‌ : న్యూఢిల్లీలో ప్రార్థనలకు  హాజరైన  ముగ్గురితో పాటు నూజివీడు ట్రిపుల్‌ఐటీలో హెచ్‌వోడీలుగా పనిచేస్తున్న ఇద్దరిని గుర్తించి సోమవారమే నూజివీడు గురుకుల పాఠశాలకు తరలించా మని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు. అక్కడ నుంచి గన్న వరం వెటర్నరీ హాస్పటల్‌లోని క్వారంటైన్‌కు తరలించామని,  సంబం ధిత కుటుంబ సభ్యులు 18 మందిని వారి స్వగృహంలోనే క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా నోటీసులు జారీ చేశామన్నారు. వారి గృహాలను మున్సి పల్‌ కమిషనర్‌ నేపా వాసుబాబు, తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌, సీఐ పి.రామచంద్రరావులతో కలిసి డీఎస్పీ సందర్శించారు.  


 ముప్పాళ్ల నుంచి ఒకరు...

 చందర్లపాడు : ప్రార్థనల్లో పాల్గొన్న ముప్పాళ్ల గ్రామానికి చెందిన వ్యక్తిని తహసీల్దార్‌ జగన్నాథరావు, ఎస్సై మణికుమార్‌, వైద్య సిబ్బంది గన్నవరంలోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.    


రాఘవాపురం నుంచి ఒకరు...

నందిగామ రూరల్‌: ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి తిరిగి వచ్చిన వ్యక్తిని అధికారులు  గన్నవరం క్వారంటైన్‌కు తరలించారు. ఎస్‌హెచ్‌వో కనకా రావు మాట్లాడుతూ, రాఘవాపురానికి చెందిన వ్యక్తి ఢిల్లీ వెళ్లి వచ్చాడని తెలియడంతో అతడిని క్వారంటైన్‌కు పంపి కుటుంబ సభ్యులను స్వీయ నిర్బంధంలో ఉంచినట్లు చెప్పారు. 

Updated Date - 2020-04-01T09:32:46+05:30 IST