డయాలసిస్‌కు 15 ప్రైవేట్ ఆసుపత్రుల గుర్తింపు
ABN , First Publish Date - 2020-04-08T10:00:44+05:30 IST
మూత్రపిండాల వ్యాధులతో బాధపడు తున్న డయాలసిస్ రోగులకు 15 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స లు

విజయవాడ సిటీ, ఏప్రిల్ 7: మూత్రపిండాల వ్యాధులతో బాధపడు తున్న డయాలసిస్ రోగులకు 15 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స లు అందించాలని కలెక్టర్ ఇంతియాజ్ మంగళవారం ఒక ప్రకటనలో కోరా రు. గుడివాడ, మచిలీపట్నం, విజయవాడ నగరాల్లో కొన్ని ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ఆసుపత్రుల్లో చేయించుకునే చికిత్సలకు ప్రభుత్వం డబ్బు చెల్లింస్తుందన్నారు.
జిల్లాలో నాలుగు ప్రభుత్వ ఆసుప త్రుల్లో కూడా డయాలసిస్ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని నెఫ్రోప్లస్ విభాగంలో, నూజివీడు ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి మచిలీపట్నం, జగ్గయ్యపేటలో కమ్యూనిటీ హె ల్త్ సెంటర్లో కూడా ఈ చికిత్సలు చేయించుకోవచ్చన్నారు. రామవరప్పా డులోని ఆయుష్ హెల్త్‌కేర్, పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఆంధ్రా హెల్త్ డ యాగ్నోస్టిక్, భవానీపురం, గవర్నర్‌పేటలోని ఆంధ్రా ఆసుపత్రులు, పోరంకి లోని క్యాపిటల్, తాడిగడపలోని కామినేని ఆసుపత్రి, సూర్యారావు పేటలోని లైఫ్‌లైన్ త్రిమూర్తి ఆసుపత్రి, కానూరులోని నాగార్జున, వినాయక థియేట ర్ పక్కన సెంటిని, సూర్యారావుపేటలోని శ్రీఅనూ, విజయ సూపర్ స్పెషా లిటీ, లబ్బీపేటలో స్వరూప సూపర్ స్పెషాలిటీ, సనత్‌నగర్‌లోని టైం ఆసు పత్రి, గుడివాడలోని అన్నపూర్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, మచిలీపట్నం లోని ఆంధ్రా ఆసుపత్రుల్లో ఈ చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు.