అర్హులందరికీ ఇళ్లు : వంశీ
ABN , First Publish Date - 2020-12-29T05:40:01+05:30 IST
అర్హులందరికీ ఇళ్లు : వంశీ
ఉంగుటూరు, డిసెంబరు 28 : అర్హులందరికీ ఇళ్లు ఇవ్వటమే సీఎం వై ఎస్ జగన్ ఆశయమని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. సోమవారం ఆ త్కూరు, పొట్టిపాడు, పెదఅవుటపల్లి, వెల్దిపాడు, తుట్టగుంట, వెన్నూతల, నాగవరప్పాడులోని లబ్ధిదారులకు వంశీ ఇళ్లపట్టాలను అందజేశారు. ఆత్కూరు, వెల్దిపాడులో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ఇళ్లులేక, అద్దెలు చెల్లించలేక ఆడపడుచులు పడుతున్న ఇబ్బందిని గమనించిన జగన్ నవరత్నాలలో అధిక ప్రాధాన్యత నిచ్చారన్నారు. ఎంపీడీవో జ్యోతి, తహసీల్దార్ ఆర్.దుర్గాప్రసాద్, వీఆర్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు, సీఐ కె.శివాజీ, ఎస్సై జి.శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.