రేపు నిడమానూరులో పట్టాల పంపిణీ
ABN , First Publish Date - 2020-12-30T06:11:27+05:30 IST
రేపు నిడమానూరులో పట్టాల పంపిణీ
విజయవాడ రూరల్/గుణదల, డిసెంబరు 29 : నిడమానూరులో గురువారం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. నిడమానూరు, గూడ వల్లి గ్రామాలకు చెందిన 1,123 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా జడ్పీ స్కూల్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పా ట్లను తహసీల్దార్ బీ సాయి శ్రీనివాస్ నాయక్, వైసీపీ నేతలు యర్కారెడ్డి నాగిరెడ్డి, దేవగిరి ఓంకార్‌రెడ్డి, కొమ్మా కోటేశ్వరరావు (కోట్లు) మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓంకార్‌రెడ్డి మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కలే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్, ఎమ్మెల్యే వంశీ పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రామిశెట్టి వెంకటేశ్వరరావు, శీలం రంగారావు, కోనేరు సుబ్బారావు, టంకసాల సుబ్బారావు, కె.సువర్ణరాజు, సమ్మెట సాంబ శివరావు, దూరు రత్నం, మాదల నాని, గూడవల్లి కన్వీనర్ కొలుసు వేణు, పైడిముక్కల కిరణ్, శేఖర్, మత్తి మణికంఠ, బషీర్ పాల్గొన్నారు.