మహిళలే ఇంటి యజమానులు
ABN , First Publish Date - 2020-12-30T06:45:17+05:30 IST
సీఎం జగన్ పట్టాలు పంపిణీ చేసి మహిళలను ఇంటి యజమానులను చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు అన్నారు.

ఇళ్ల పట్టాల పంపిణీలో ఎమ్మెల్యేలు
నందిగామ రూరల్, డిసెంబరు 29 : సీఎం జగన్ పట్టాలు పంపిణీ చేసి మహిళలను ఇంటి యజమానులను చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు అన్నారు. పల్లగిరి, కమ్మవారిపాలెం, అంబారుపేట, ఐతవరం, కంచల గ్రామాల్లోని 780 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంగళవారం పంపిణీ చేశారు. అనంతరం ఐతవరంలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుతో కలిసి నూతన గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. మంగునూరు కొండారెడ్డి, నెలకుదిటి శివనాగేశ్వరరావు, గరికపాటి భాస్కరం, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో లక్ష్మీలీలా, హౌసింగ్ డీఈ వీరభద్రరావు పాల్గొన్నారు.
విస్సన్నపేట : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే కె.రక్షణనిధి అన్నారు. నూతి పాడు, నాయకులగూడెం, కలగర రామచంద్రాపురం, తెల్లదేవరపల్లి, పుట్రేలల్లో మంగళవారం 221 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అర్హు లందరికీ నివేశన స్థలాలు అందుతాయన్నారు. నివే శన స్థలం అందని వారు వలంటీర్ల ద్వారా మరో మారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తిరువూరు ఏఎంసీ చైర్మన్ మద్దిరెడ్డి సూర్యనారా యణ రెడ్డి, హౌసింగ్ డీఈ శ్యామ్ మోహన్, ఏఈ షేక్ జాని, తహసీల్దార్ మురళీకృష్ణ, ఎంపీడీవో వెంకట రమణ, వైసీపీ నాయకులు భీమిరెడ్డి లోకేశ్వర రెడ్డి, అనుమోలు శివ బాజీ, మాజీ ఎంపీపీ, వైస్ ఎంపీపీలు బూక్యా రాణి, వోలేటి దుర్గారావు, నక్కలపు సుబ్బారావు, శివయ్య పాల్గొన్నారు.
మహిళల నిరసన
పుట్రేల తూర్పు ఎస్సీ కాలనీలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ సమయంలో కొందరు మహిళలు తమకు ఇళ్లపట్టాలు రాలేదని నిరసనకు దిగారు. అనర్హులకు స్థలాలు మంజూరు చేశారని ఆరోపించారు. దీంతో ఏఎంసీ చైర్మన్ మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి మహిళలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అర్హులైన పేదలందరికీ నివేశన స్థలాలు ఇస్తామని మరో మారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో మహిళలు శాంతించారు.
ముసునూరు : పేదవాడి ఇంటి కలను సాకారం చేసేందకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. కోర్లకుంట, చింతలవల్లి, ముసునూరు, కాట్రేనిపాడు, చిల్లబోయినపల్లి, వేల్పుచర్ల, బలివే గ్రామాల్లో మంగళ వారం 1280 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే పంపీణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నారన్నారు. తహసీల్దార్ చిట్టిబాబు, ఎంపీడీవో సత్యనారాయణ, స్పెషల్ ఆఫీసర్ వెంకట రమణరావు, వైసీపీ మండల కన్వీనర్ మూల్పూరి నాగవల్లేశ్వరావు, సొసైటీ అధ్యక్షుడు రేగుల గోపాలకృష్ణ, కోటగిరి రాజా, సుగసాని శ్రీనివాసరావు, యనమదల రాజేంద్రప్రసాద్, యూత్ అధ్యక్షుడు తుల్లిమెల్లి రంగరావు, నాగళ్ల వెంకటేశ్వరావు, వరకూటి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
వత్సవాయి : అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థల్లాన్ని మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. పోలం పల్లి, పెంట్యాలవారిగూడెం, డబ్బాకుపల్లి, వత్సవాయి, కాకరవాయి గ్రామాల్లో మంగళవారం లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాల్లోని అర్హులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు. వైసీపీ మండల కన్వీనర్ రామారావు, నాయకులు తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు.


