పోలీసులతో సమానంగా హోంగార్డుల సేవలు
ABN , First Publish Date - 2020-12-07T06:30:03+05:30 IST
పోలీసులతో సమానంగా హోం గార్డులు వివిధ రంగాల్లో సేవలందిస్తున్నారని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అన్నారు.

మచిలీపట్నం టౌన్, డిసెంబరు 6 : పోలీసులతో సమానంగా హోం గార్డులు వివిధ రంగాల్లో సేవలందిస్తున్నారని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అన్నారు. హోమ్‌గార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో హోం గార్డుల నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 782 మంది హోం గార్డులు పోలీసులతో పాటు రక్షణ, ట్రాఫిక్, పోలీసు స్టేషన్ విధులు, డ్యూటీ డ్రైవర్లు, కేంద్ర ప్రభుత్వ సంస్థల రక్షణ విధులు నిర్వహిస్తున్నారన్నారు. హోం గార్డుల గౌరవ వేతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పదవీ విరమణ చేసినా, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోం గార్డుల కుటుంబ సభ్యులకు సాయం అందిస్తున్నామన్నారు. 1963లో స్వచ్ఛంద సేవా సంస్థగా ఏర్పడిన హోంగార్డు వ్యవస్థ అంచెలంచెలుగా ఎదిగిందన్నారు. ఏఎస్పీ వకుల్ జింథాల్, ట్రైనీ ఐపీఎస్ ప్రేరణకుమార్, ఏఆర్ ఏఎస్పీ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర, బందరు డీఎస్పీ రమేష్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, దిశ డీఎస్పీ అజీజ్, ఎఆర్ డీఎస్పీ విజయకుమార్, చిలకలపూడి సిఐ వెంకట నారాయణ, ఇనకుదురు సీఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం గార్డులు కె. చంద్ర శేఖరరావు, సిహెచ్. గుణశేఖర్, బ్రహ్మనాగ ప్రసాద్, ఆనందబాబు, కోటేశ్వరమ్మ, రామలక్ష్మి, సిహెచ్. హనుమం తరావు, ఎం. అప్పారావు, జె. శ్రీనివాసరావు, సూరిబాబుకు ఎస్పీ బహుమతులు అందచేశారు. అనంతరం హోం గార్డులు నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
తానా సేవలు అభినందనీయం
విధి నిర్వహణలో శ్రమిస్తున్న పోలీసులకు తానా అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు అన్నారు. తానా, సుధీక్షణ ఫౌండేషన్ సంయుక్తంగా ఆదివారం పోలీసులకు 100 హెల్మెట్లు, 40 రగ్గులను ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల సేవలను స్వచ్ఛంద సేవా సంస్థలు గుర్తించడం ముదావహమన్నారు. తానా జీవితకాల సభ్యురాలు కాకాని తరుణ్, సుధీక్షణ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చిగురుపాటి విమల, తానా సభ్యులు బషీర్ షేక్, ఏఆర్ ఏఎస్పీ సత్యనారాయణ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.