పేదలందరికీ ఇళ్లు

ABN , First Publish Date - 2020-07-18T09:54:06+05:30 IST

జిల్లాలో మూడు లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని ..

పేదలందరికీ ఇళ్లు

ఇబ్రహీంపట్నం, జూలై 17:  జిల్లాలో  మూడు లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని,    పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. ఇబ్రహీంపట్నం, జూపూడి సడక్‌ రోడ్‌ ప్రభుత్వ స్థలంలో వేసిన లే అవుట్‌ను సబ్‌కలెక్టర్‌ హెచ్‌.ఎం.ధ్యానచంద్రతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ  జిల్లా లో నివేశనా స్థలాల కోసం 1489 లే అవుట్‌లు అభివృద్ధి చేస్తున్నామని, పట్టాల ముద్రణ  జరుగుతుందని, ప్రింటింగ్‌ పనులు త్వరిగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంఽధిత రెవెన్యూ డివిజన్‌ అధికారులను, తహసీల్దార్లను ఆదేశించినట్టు తెలిపారు.  లే అవుట్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ నాయుడు, ఎంపీడీవో దివాకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-18T09:54:06+05:30 IST