క్రిస్మస్ స్టార్ గుర్తు, ఆర్చి కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2020-12-28T15:53:21+05:30 IST

వైసీపీ ఎంపీ నందిగం సురేష్ మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు.

క్రిస్మస్ స్టార్ గుర్తు, ఆర్చి కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ

గుంటూరు జల్లా: వైసీపీ ఎంపీ నందిగం సురేష్ మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యారు. వెలగపూడిలో రెండు దళిత వర్గాల మధ్య ఘర్షణను ఆయన ప్రొత్సహించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రిస్మస్ స్టార్ గుర్తు, ఆర్చి కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసినట్లుగా సమాచారం. గత రాత్రి ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. పలువురు గాయపడ్దారు. వారిని ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు.


గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం, వెలగపూడిలోని ఎస్సీ కాలనీలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వివాదం గత రెండు మూడు రోజులుగా కొనసాగుతోంది. ఎస్సీ కాలనీలో ఆర్చి నిర్మించి.. జగజ్జీవన్‌రామ్ కాలనీగా పేరు పెట్టాలని ఎంపీ నందిగం సురేష్ అనుచరులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ నిర్ణయంపై మరొక వర్గం అభ్యరంతరం వ్యక్తం చేసింది. దీంతో అన్ని విషయాల్లో ఇరు వర్గాల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి.

Updated Date - 2020-12-28T15:53:21+05:30 IST