వేతనాలివ్వకుండా ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ వేధింపులు!

ABN , First Publish Date - 2020-12-05T05:58:36+05:30 IST

ఒక మహిళా టీచరుకు 8 నెలలుగా వేతనాలివ్వకుండా వేధింపుల కు గురిచేస్తున్న ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ నిర్వాకమిది.

వేతనాలివ్వకుండా ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ వేధింపులు!

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం :  ఒక మహిళా టీచరుకు 8 నెలలుగా వేతనాలివ్వకుండా వేధింపుల కు గురిచేస్తున్న ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ నిర్వాకమిది. చల్లపల్లి ఎస్‌ఆర్‌వైఎస్పీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, నెలల తరబడి వేత నాలు ఇవ్వటం లేదని ఓ మహిళా టీచరు ఉన్నతాధి కారులకు ఫిర్యాదు చేసింది. ఈ అంశం పత్రికల్లోనూ రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. అయినా సంబంధిత టీచరుకు వేతనాలిప్పించేందుకు అధికా రులు మీనమేషాలు లెక్కిస్తూ తమ పరిధిలో లేదం టూ తప్పించుకుని తిరుగుతున్నారు. చల్లపల్లి ఎస్‌ ఆర్‌వైఎస్పీ జూనియర్‌ కళాశాల ఉన్నత పాఠశాలలో సోషల్‌ టీచరుగా పనిచేస్తున్న వై శ్రీదేవి పట్ల కళా శాల ప్రిన్సిపాల్‌ అసభ్యంగా ప్రవర్తించి వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన అధికారులు నివేదికను ఉన్నతాధికారులకు పంపారా.. లేదా? పంపితే చర్యలు తీసుకునేందుకు ఎందుకు జాప్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. లైంగిక వేధింపులపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ తాను ప్రభుత్వ ఉద్యోగి అన్న సంగతి మరిచి తన సామాజిక వర్గం నేతలను తీసుకువచ్చి హంగామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగి తాను చేసిన పొరపాట్లను బయట కు రానీయకుండా తన సామాజికవర్గ నేతల అండతో కప్పిపుచ్చుకునే ప్రయత్నించటం ఎంతవరకు సమం జసమనే వాదన విద్యావేత్తల నుంచి వినిపిస్తోంది.  

సక్రమంగా విచారించలేదు : టీచర్‌ శ్రీదేవి

బాధిత టీచర్‌ శ్రీదేవి మాట్లాడుతూ ఇన్‌ఛార్జి ప్రిన్సిపా ల్‌ తనకు 8 నెలలుగా వేతనాలివ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా నవంబరు 4న పత్రికలో కథనం వచ్చింది. దీంతో అధి కారులు విచారణ చేశారన్నారు.  విచారణ సమయం లో తనవద్ద ఉన్న సాక్ష్యాలను తహసీల్దార్‌కు ఇస్తే వాటిని పూర్తిగా పరిశీలించకుండా అసహనం వ్యక్తం చేశారని ఆరోపించారు. పోలీసులకు, ఎస్పీకి అనేక సార్లు ఫిర్యాదు చేసినా తన నుంచి ఇప్పటి వరకు వివరాలు సేకరించలేదన్నారు.

తనకు అనుకూలమైన ఉపాధ్యాయులు పాఠశాల కు రాకున్నా, వారికి వేతనాలు ఇచ్చేందుకు హాజరుప ట్టీలను ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ టాంపరింగ్‌ చేశారని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు తన వద్ద ఉన్నా యని ఆమె పేర్కొన్నారు. తోటి టీచర్లను బెదిరించి తనకు వ్యతిరేకంగా అధికారులకు ఫిర్యాదులు చేయిం చాడని ఆరోపించారు. విద్యాశాఖ అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకుని తనపై తప్పుడు నివేదికలు ఇస్తూ వారిని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేసి తనకు వేతనాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు.

Updated Date - 2020-12-05T05:58:36+05:30 IST