జిల్లాలో భారీ వర్షం

ABN , First Publish Date - 2020-09-14T08:38:29+05:30 IST

జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది.

జిల్లాలో భారీ వర్షం

మచిలీపట్నం టౌన్‌, సెప్టెంబరు 13 : జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది.  బందరులో రహదారులు జలమయమయ్యాయి. జిల్లాలో సరాసరి 20 మి.మీ వర్షం నమోదు కాగా తిరువూరులో 157 మి.మీ అధికంగా నమోదయింది. బంటుమిల్లిలో 54 మి.మీ, చాట్రాయిలో 45 మి.మీ, ముదినేపల్లిలో 29 మి.మీ, గుడివాడలో 27 మి.మీ, మండవల్లిలో 27మి.మీ, విస్సన్నపేటలో 26 మి.మీ, పెదపారుపూడిలో 25 మి.మీ, కృత్తివెన్నులో 24 మి.మీ, బాపులపాడులో 24 మి.మీ, గూడూరులో 24 మి.మీ, చందర్లపాడులో 22మి.మీ, జి.కొండూరు, మచిలీపట్నంలో 22 మి.మీ చొప్పున నమోదైంది.


పెడన, కంకిపాడులో 19 మి.మీ, నందివాడ, ఆగిరిపల్లి, గుడవల్లేరు, కలిదిండిలో 18 మి.మీ, కైకలూరులో 17మి.మీ, పెనుగంచిప్రోలులో 16 మి.మీ, మైలవరంలో 16 మి.మీ, నూజివీడు, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, కంచికచర్లలో 15 మి.మీ చొప్పున నమోదైంది. ఎ.కొండూరు, పమిడిముక్కల, వత్సవాయి, వీరులపాడు, ముసునూరులో 14 మి.మీ చొప్పున, నందిగామ, ఘంటసాల, ఉయ్యూరులో 13 మి.మీ చొప్పున, గంపలగూడెం, జగ్గయ్యపేట, అవనిగడ్డలో 12 మి.మీ చొప్పున వర్షం కురిసింది. మొవ్వ, విజయవాడ రూరల్‌, విజయవాడ అర్బన్‌, తోట్లవల్లూరులో 10 మి.మీ చొప్పున, గన్నవరం, కోడూరు, మోపిదేవిలలో 9 మి.మీ చొప్పున, నాగాయలంకలో 8మి.మీ, చల్లపల్లి,  ఉంగుటూరులో 5 మి.మీ చొప్పున,  పామర్రులో 4 మిమీ, రెడ్డిగూడెంలో 2 మి.మీ వర్షం కురిసింది.  పెడన :  ఆదివారం పెడనలో భారీ వర్షం కురిసింది. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారిపై నీరు నిలిచింది. డ్రెయిన్లు పొంగి మురుగునీరు రోడ్ల మీద  ప్రవహిస్తోంది. కూచిపూడి  : అల్పపీడనం కారణంగా శనివారం నుంచి విస్తారంగా వర్షాలు కురవటంతో జనజీవనం స్తంభించింది. బస్టాండ్‌,  రహదారులు జలమయం అయ్యాయి.  


 పల్లపు ప్రాంతాలు జలమయం 

బంటుమిల్లి : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంటుమిల్లిలో బీఎన్‌ఆర్‌ కాలనీ, బస్టాండు సెంటర్‌, అర్తమూరు-మణిమేశ్వరం రోడ్డు తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డ్రైనేజి వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. అధికారులు స్పందించి డ్రైనేజీని మెరుగు పర్చి, అంటు వ్యాధు లు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 


కోడూరులో...

కోడూరు :  భారీ వర్షానికి కోడూరులోని రహదారులు జలమయ మయ్యాయి.  నీరు పోయే మార్గం లేక రహదార్లు డ్రెయిన్లను తలపిస్తున్నాయి.  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని ప్రజలు కోరుతున్నారు. రానున్న 24 గంటల్లో  భారీ వర్షం, ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపినందున మండలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా తహసీల్దార్‌ ఎస్‌.కె.లతీఫ్‌ పాషా తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. 


 వరద నీరు విడుదల 

అవనిగడ్డ రూరల్‌  : ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు 1,18,500 క్యూసెక్యుల వరదనీరు కృష్ణానదికి విడుదల చేసినట్లు డీఈ రవికిరణ్‌ ఆదివారం తెలిపారు. 1,02,000 క్యూసెక్యులు కృష్ణానదికి, పంట కాల్వలకు 16,500 క్యూసెక్యుల నీరు విడుదలైనట్లు ఆయన తెలిపారు.  


విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం

కైకలూరు,సెప్టెంబరు 13 : ఆటపాకలోని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు చెందిన కుమారి కోల్డ్‌స్టోరేజ్‌లో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. శీతనపల్లి గ్రామానికి చెందిన కమతం జోస్‌ఫతంబి (29) ఐస్‌గడ్డను గునపంతో పొడుస్తుండగా  గునపం విద్యుత్‌ వైర్ల మీదకు జారి పడింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కైకలూరు సీఐ కె.వి.వి.ఎల్‌.నాయుడు, టౌన్‌ ఎస్సై షణ్ముఖసాయి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి తండ్రి ఏబు ఫిర్యాదుతో ఎస్సై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Updated Date - 2020-09-14T08:38:29+05:30 IST