గుండెపోటుతో కొత్తపేట హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

ABN , First Publish Date - 2020-12-25T06:09:55+05:30 IST

గుండెపోటుతో కొత్తపేట హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

గుండెపోటుతో కొత్తపేట హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

చిట్టినగర్‌, డిసెంబరు 24: కొత్తపేట పోలీసు స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పిల్లి కుటుంబరావు(39) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. గుండెపోటుతో బాధపడుతున్న ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. స్వగ్రామం బంటుమిల్లి మండలం చిన్న తుమ్మిడికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. కుటుంబరావు భార్య నాగలక్ష్మి, కుమారులు సిద్ధార్థ రామపవన్‌ కుమార్‌ (14), వెంకట సాయి మారుతి (11) కన్నీరు మున్నీరుగా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. కుటుంబరావు మరణం బాధించిందని కొత్తపేట సీఐ ఎండీ ఉమర్‌ విచారం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-12-25T06:09:55+05:30 IST