గుంటూరు: అత్యాచార బాధితురాలికి టీడీపీ నేత పరామర్శ

ABN , First Publish Date - 2020-10-14T18:42:25+05:30 IST

జిల్లాలోని జీజీహెచ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని తెలుగు మహిళా నేత వేగుంట రాణి పరామర్శించారు.

గుంటూరు: అత్యాచార బాధితురాలికి టీడీపీ నేత పరామర్శ

గుంటూరు: జిల్లాలోని జీజీహెచ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని తెలుగు మహిళా నేత వేగుంట రాణి పరామర్శించారు. అనంతరం నేత మాట్లాడుతూ జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. సీఎం, హోం మంత్రి నివాసం ఉండే జిల్లాలోనూ అత్యచారాలు ఆగడం లేదని అన్నారు. మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మా నోరు మెదపడం లేదని మండిపడ్డారు. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వేగుంట రాణీ స్పష్టం చేశారు.


గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పొడపాడులో వివాహితపై అత్యాచారం జరిగింది. కిరాణా షాపుకు వచ్చిన మహిళను శాంతిరాజు అనే వ్యక్తి నిర్బంధించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాత్రంతా కనిపించకపోవడంతో మహిళ కోసం బంధువులు గాలించారు. చివరకు శాంతి రాజు ఇంట్లో  నిర్బంధంలో ఉన్న మహిళను బంధువులు గుర్తించి జీజీహెచ్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-10-14T18:42:25+05:30 IST