-
-
Home » Andhra Pradesh » Krishna » gudivada Officers
-
గుడివాడలో కళ్లు మూసుకున్న అధికారులు
ABN , First Publish Date - 2020-03-13T10:32:00+05:30 IST
చట్టానికి ఎవరూ అతీతులు కారని గొంతుచించుకునే అధికారులు ఎన్నికల సంఘం ఆదేశాలకు భిన్నంగా ప్రభుత్వ సచివాలయాలు, వంతెన లకు వేసిన పార్టీ రంగులు తొలగించకుండా మిన్నకుండి చెవుల్లో పూలు పెడుతున్నారు.

గుడివాడటౌన్, మార్చి 12 : చట్టానికి ఎవరూ అతీతులు కారని గొంతుచించుకునే అధికారులు ఎన్నికల సంఘం ఆదేశాలకు భిన్నంగా ప్రభుత్వ సచివాలయాలు, వంతెన లకు వేసిన పార్టీ రంగులు తొలగించకుండా మిన్నకుండి చెవుల్లో పూలు పెడుతున్నారు. ఎన్నికల ప్రవర్తన నియ మావళిని పెడచెవిన పెడుతూ ఫిర్యాదులు సైతం పట్టించుకో కుండా పాలకవర్గాల కను సన్నల్లో అధికార గణం వ్యవహరించడం చర్చనీయాం శమైంది.
మార్చి 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుల్లోకి వచ్చింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ భవనాలు, కాల్వ వంతెన లకు వేసి అధికార పార్టీ చిహ్నాలు, రంగు లు తక్షణం తొలగించాలని ఎన్నికల సం ఘం ఆదేశించింది. అయితే, గుడివాడలో అధికా రణం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. బేతవోలు వార్డు సచివాలయ భవనం, నాగ వరప్పాడు వంతెనలకు వేసిన వైసీపీ రం గులు తొలగించడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణంలో రాజకీయ నాయకుల ఫోటోలతో ఉన్న బ్యానర్లు తొలగించిన అధికారులు సచి వాలయం వంతెనకు వేసిన పార్టీ రంగులు తొలగించడంలో తాత్సారం చేయడం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిం చడమే నని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆర్డీవోకు భవిష్యత్ భద్రతా దళం ఫిర్యాదు
గ్రామ, వార్డు సచివాలయాలకు, రోడ్ల డివైడర్‌లకు, కాలువ వంతెనలకు రాజకీయ పార్టీల రంగులు వేయడం హైకోర్టు సూచ నలకు, ఎన్నికల నియమావళికి విరుద్ధమని, తక్షణం పార్టీ రంగులు తొలగించాలని భవిష్యత్ భద్రతాదళం అధ్యక్షుడు వై.వి. మురళీకృష్ణ గురువారం ఆర్డీవో శ్రీను కుమార్‌కు వినతి పత్రం ఇచ్చారు.
జనవరి 13వ తేదీ, ఫిబ్రవరి 2వ తేదీన బేతవోలు వార్డు సచివాలయం, నాగవర ప్పాడు వంతెనకు వేసిన వైసీపీ రంగులు, ఫోటోలతో సహా ఫిర్యాదు చేసినా పట్టించు కోలేదని ఆర్డీవోకు తెలిపారు.
ఎన్నికల ప్రవ ర్తనా నియమావళి అమలులో ఉన్నందున తక్షణం సదరు పార్టీ రంగులు తొలగించి బాధ్యులైన అధికారు లపై చర్యలు తీసుకో వాలని మురళీకృష్ణ కోరారు.